‘800’: స్పిన్ మాంత్రికుడు.. ఫస్ట్‌లుక్‌లోనే తిప్పేశాడు!..

  • Publish Date - October 13, 2020 / 07:37 PM IST

Muthiah Muralidaran Biopic 800: శ్రీలంక క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ సినిమాగా తెరకెక్కబోతోంది. ప్రముఖ తమిళ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మురళీధరన్ పాత్రలో నటిస్తున్నారు. ‘800’ పేరు ఖరారు చేశారు. మంగళవారం చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.


మురళీధరన్‌గా విజయ్ సేతుపతి లుక్ అచ్చుగుద్దినట్టు దిగిపోయాడు. మేకోవర్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో కానీ మురళి క్యారెక్టర్‌కు విజయ్ సేతుపతే కరెక్ట్ చాయిస్ అనిపిస్తోంది. మోషన్ పోస్టర్లో మరళిధరన్ చిన్నతనం నుంచి స్పిన్ మాంత్రికుడిగా ఎదిగిన విధానం చూపించారు. కాగా తన పాత్ర పోషణ కోసం విజయ్ ముత్తయ్య మురళీధరన్ దగ్గర క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినీ, క్రికెట్ వర్గాల్లో ‘800’ మోషన్ పోస్టర్ గురించి ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.


ఎమ్ఎస్ శ్రీపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని మూవీ టీమ్ తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో షూటింగ్ ప్రారంభం కానుంది.

ట్రెండింగ్ వార్తలు