Devara 2: ‘దేవర 2’లో మక్కల్ సెల్వన్.. తారక్‌తో తలపడనున్న విజయ్ సేతుపతి!

ఎన్టీఆర్ దేవర 2(Devara 2)లో కీ రోల్ చేయనున్న విజయ్ సేతుపతి.

vijay sethupathi playing special role in ntr devara part 2

  • దేవర 2 కోసం కొరటాల శివ మాస్టర్ ప్లాన్
  • సీక్వెల్‌లో విజయ్ సేతుపతి సంచలన పాత్ర
  • దేవర 2లో కొరటాల శివ మాస్టర్ ప్లాన్

Devara 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. సముద్రతీర నేపథ్యంలో సాగే హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం, ఇప్పుడు సీక్వెల్ కోసం సిద్ధమవుతోంది. ‘దేవర 2(Devara 2)’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగంలో క్లిఫ్ హ్యాంగర్ లాంటి ముగింపు ఇవ్వడంతో, రెండో భాగంలో కథ ఏ మలుపు తిరుగుతుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Anchor Ravi: సమ్మర్ వైబ్స్.. భార్య, కూతురితో స్విమ్మింగ్ పూల్‌లో రవి సందడి.. ఫొటోలు

అయితే, ఈ సీక్వెల్ కోసం దర్శకుడు కొరటాల శివ ఒక సంచలన సర్ప్రైజ్‌ను ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ స్టార్ నటుడు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతిని ఒక కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. విజయ్ సేతుపతి తన వైవిధ్యమైన నటనతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. ఎన్టీఆర్ వంటి పవర్‌ఫుల్ నటుడితో విజయ్ సేతుపతి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది సినిమాకు పెద్ద అసెట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, త్వరలోనే చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్‌లో చేరితే, దేవర పార్ట్ 2 రేంజ్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ వంటి స్టార్లతో నిండిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఎంట్రీ ఇవ్వడం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులకు దారితీస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.