Vijay : విజయ్ కొత్త సినిమా ఆ హాలీవుడ్ మూవీకి రీమేక్.. కొత్త పోస్టర్‌తో డౌట్..

విజయ్ కొత్త సినిమా 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' ఆ హాలీవుడ్ మూవీకి ఫ్రీమేక్ గా వస్తుందా..? కొత్తగా రిలీజ్ చేసిన పోస్టర్..

Vijay The Greatest Of All Time movie is free make for that hollywood super hit movie

Vijay : తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్.. ప్రస్తుతం తన 68వ సినిమాని వెంకట్ ప్రభుతో చేస్తున్న సంగతి తెలిసిందే. Thalapathy68 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా నిన్న న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని అనౌన్స్ చేశారు. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే ఇంగ్లీష్ టైటిల్ ని అనౌన్స్ చేశారు.

ఇక రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ రెండు పాత్రల్లో కనిపించారు. దీంతో ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ చేస్తున్నారని అర్ధమవుతుంది. కాగా నేడు ఈ మూవీ నుంచి మరో పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఇద్దరు విజయ్ లకి సంబంధించిన ఓ బైక్ యాక్షన్ సన్నివేశం కనిపిస్తుంది. ఇక ఈ పోస్టర్ చూసిన తరువాత కొందరు నెటిజెన్స్ ఈ మూవీ.. ఓ సూపర్ హిట్ హాలీవుడ్ మూవీకి రీమేక్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Also read : Ustaad : మంచు మనోజ్ టాక్ షోకి గెస్టుగా.. ఆ స్టార్ హీరో రాబోతున్నాడా..?

విల్ స్మిత్ నటించిన ‘జెమినీ మెన్’ అనే ఓ హాలీవుడ్ మూవీకి ఇది రీమేక్ గా వస్తుందని చెపుతున్నారు. ఈ చిత్రంలో విల్ స్మిత్ మొత్తం మూడు పాత్రలు పోషించారు. మూడో పాత్ర విలన్ రోల్. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన విజయ్ సినిమా పోస్టర్.. జెమినీ మెన్ మూవీ పోస్టర్స్ కి సిమిలర్ గా ఉన్నాయి. దీంతో విజయ్ చిత్రం.. విల్ స్మిత్ సినిమాకి రీమేక్ గానే తెరకెక్కుతోందని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమా దర్శకుడు వెంకట్ ప్రభు గతంలో శింబు తెరకెక్కించిన ‘మానాడు’ చిత్రం కూడా హాలీవుడ్ మూవీకి ఫ్రీమేక్ గా తెరకెక్కిందే. టామ్ క్రూజ్ నటించిన ‘ఎడ్జ్ ఆఫ్ టొమోరో’కి మానాడు అన్ అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కింది. ఇప్పుడు విజయ్ సినిమా కోసం కూడా వెంకట్ ప్రభు.. అలానే మరో హాలీవుడ్ మూవీ రీమేక్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం నిజంగానే ఆ చిత్రానికి ఫ్రీమేక్ అనేది తెలియాలంటే వేచి చూడాలి.