Ustaad : మంచు మనోజ్ టాక్ షోకి గెస్టుగా.. ఆ స్టార్ హీరో రాబోతున్నాడా..?

మంచు మనోజ్ హోస్ట్ గా చేస్తున్న ‘ఉస్తాద్’ టాక్ షోకి ఆ స్టార్ హీరో గెస్టుగా రాబోతున్నాడా..?

Ustaad : మంచు మనోజ్ టాక్ షోకి గెస్టుగా.. ఆ స్టార్ హీరో రాబోతున్నాడా..?

Manchu Manoj Ustaad talk show new guest is that tollywood star hero

Updated On : January 1, 2024 / 7:47 PM IST

Ustaad : మంచు మనోజ్ హోస్ట్ గా ‘ఉస్తాద్’ అనే కొత్త సెలబ్రిటీ టాక్ షో ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఈ విన్’లో ఈ షో ప్రసారం అవుతుంది. ఈ షో మొదటి ఎపిసోడ్ ని నానితో మొదలుపెట్టిన మంచు మనోజ్.. ఆ తరువాత రానా దగ్గుబాటి, సిద్దు జొన్నలగడ్డతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఇప్పుడు కొత్త ఎపిసోడ్ కి ఓ స్టార్ హీరోని తీసుకు రాబోతున్నారట.

ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఓ ఫోటోని రిలీజ్ చేశారు. ఆ పిక్ లో మనోజ్.. ఆ స్టార్ గెస్ట్ ని కౌగిలించుకొని ఉన్నాడు. దీంతో ఆ స్టార్ ఎవరు అన్నది కనిపించలేదు. ఆ గెస్ట్ ఎవరంటూ కనిపెట్టండి అంటూ షో నిర్వాహుకులు ఆడియన్స్ కి వదిలేశారు. ఇక ఈ పోస్ట్ చూసిన ఆడియన్స్.. ఆ గెస్ట్ మాస్ మహారాజ్ రవితేజ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ టాక్ షోని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు రవితేజ నటిస్తున్న ‘ఈగల్’ చిత్ర నిర్మాతలు కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే. ఈ సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ని యమా హుషారుగా నిర్వహిస్తున్న చిత్ర నిర్మాతలు.. ఇప్పుడు రవితేజని ఉస్తాద్ షోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ తో అటు ఈగల్ ప్రమోషన్స్‌ని, ఇటు ఈ టాక్ షో రేటింగ్స్ పెరిగేలా ఒకేసారి ప్రయత్నిస్తునట్లు తెలుస్తుంది.

Also read : Janhvi Kapoor : ప్రియుడి పేరు నోరు జారిన జాన్వీ.. అతడు మాజీ సీఎం మనవడేనా..?

 

View this post on Instagram

 

A post shared by ETV Win (@etvwin)

మరి ఈ ఎపిసోడ్ గెస్ట్ రవితేజనేనా..? లేదా..? అనేది తెలియాలంటే వేచి చూడాలి. జనవరి 4న ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతుంది. ఇక రవితేజ ఈగల్ విషయానికి వస్తే.. ప్రముఖ టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేనిని దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కావ్య తపర్ హీరోయిన్ గా నటిస్తుంటే అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 13న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ట్రైలర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.

ఇటీవలే ఈ షో కాన్సెప్ట్ ని వివరిస్తూ మనోజ్ తో ఒక ప్రోమోని రిలీజ్ చేశారు. తాజాగా నేడు ఈ షో మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. మొదటి ఎపిసోడ్ కి నేచురల్ స్టార్ నాని గెస్ట్ గా వచ్చారు. ఇక ఈ షోలో నానితో పాటు మరో అతిథి కూడా పాల్గొనబోతున్నారు. అతిథి అంటే సెలబ్రిటీ అనుకున్నారేమో.. అసలు కాదు.