Varisu: వారిసు సెన్సార్ టాక్.. విజయ్ ఖాతాలో మరో హిట్టు!

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారిసు’ కోసం యావత్ తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు విజయ్ రెడీ అవుతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Vijay Varisu Movie Completes Censor Works

Varisu: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారిసు’ కోసం యావత్ తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు విజయ్ రెడీ అవుతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Varisu Trailer: వారిసు ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన విజయ్

వారిసు చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా వచ్చిన వారిసు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అవుతుందని సెన్సార్ బోర్డు కితాబిచ్చినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో ఎమోషన్స్‌ను నటీనటులు క్యారీ చేసిన విధానం ఆడియెన్స్ మనసులకు హత్తుకుపోతుందని వారు తెలిపారు. ఈ సినిమా క్లీన్ యు సర్టిఫికెట్‌ను తెచ్చుకోవడంతో వారిసు చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.

Varisu: ‘వారసుడు’కి గట్టి పోటీనిస్తున్న సీనియర్ హీరోలు!

ఇక ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తోండగా, సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.