Radheshyam : సినిమా రిలీజ్ అయితే మాకు 100 టికెట్స్ ఇవ్వాలి.. విజయవాడ మేయర్ లేఖ..
విజయవాడ మేయర్ భాగ్యలక్షి విజయవాడలోని థియేటర్ ఓనర్లుకు ఓ లేఖని పంపించింది. నగరంలో కొత్త సినిమా విడుదలైతే ప్రతి షోకి తమకు 100 టికెట్లు కావాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.......
- Saketh U
- Published On : March 11, 2022 / 01:50 PM IST
Vijayawada Mayor
Viajayawada Mayor : ఇటీవల గత కొన్ని నెలలు ఏపీలో సినీ పరిశ్రమకి, థియేటర్లకు ఇబ్బందులు ఎదురైనా సంగతి తెలిసిందే. చిరంజీవితో సహా చాలా మంది సినీ ప్రముఖులు జగన్ ని కలిసి పలుమార్లు సినీ పరిశ్రమ సమస్యలని వివరించారు. తాజాగా రెండు రోజుల క్రితమే సినిమా టికెట్ రేట్లని పెంచుతూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇవాళ ‘రాధేశ్యామ్’ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే విజయవాడలో చాలా థియేటర్లకు వచ్చిన ఓ లేఖ ఇప్పుడు వైరల్ అవుతుంది.
విజయవాడ మేయర్ భాగ్యలక్షి విజయవాడలోని థియేటర్ ఓనర్లుకు ఓ లేఖని పంపించింది. నగరంలో కొత్త సినిమా విడుదలైతే ప్రతి షోకి తమకు 100 టికెట్లు కావాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. అది కూడా తన వ్యక్తిగతంగా కాకుండా అధికారికంగా మేయర్ హోదాలో లేఖ రాసి పంపడంతో ఇప్పుడు ఈ విషయం చర్చాంశనీయంగా మారింది.
Ananth Sreeram : అదిరిపోయే డ్యాన్స్ చేసి అందరికి షాకిచ్చిన అనంత శ్రీరామ్..
విజయవాడ మేయర్ ఆ లేఖలో.. ”విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విడుదలయ్యే ప్రతి కొత్త సినిమాకు టికెట్లు సమకూర్చాలంటూ పార్టీ ప్రతినిధులు, కార్పొరేటర్ల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. కాబట్టి కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు తప్పనిసరిగా ప్రతి షోకి మాకు 100 టికెట్లు ఇవ్వండి. ఆ టికెట్లకు డబ్బు కూడా చెల్లిస్తాము. ఇకనుంచి విడుదల అయ్యే ప్రతి సినిమాలకి టికెట్లని ఏర్పాటు చేయండి.’’ అని తెలిపారు. అధికారికంగా ఈ లేఖ నగరంలోని చాలా థియేటర్లకు వెళ్ళింది.
