Ananth Sreeram : అదిరిపోయే డ్యాన్స్ చేసి అందరికి షాకిచ్చిన అనంత శ్రీరామ్..

అయితే షోలో కొన్ని ఎపిసోడ్స్ లో జడ్జెస్ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేస్తారు. తాజాగా ఇటీవల వచ్చిన ఓ ఎపిసోడ్ లో అనంత శ్రీరామ్ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. మొదట అమ్మాయిలతో.......

Ananth Sreeram : అదిరిపోయే డ్యాన్స్ చేసి అందరికి షాకిచ్చిన అనంత శ్రీరామ్..

Anantha Sreeram

Ananth Sreeram :   గేయ రచయితగా, అద్భుతమైన పాటలు రాస్తూ తెలుగు వారికి సుపరిచితులయ్యారు అనంత శ్రీరామ్. తాను పాటలు రాయడమే కాక అప్పుడప్పుడు పాటలు పాడుతుంటారు కూడా. ప్రస్తుతం అనంత శ్రీరామ్ ఓ ఛానల్ లో వస్తున్న ‘సరిగమప’ అనే ఒక మ్యూజికల్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ఈ షోలో జడ్జిగా కంటెస్టెంట్స్ పాడిన పాటలకి తనదైన శైలిలో జడ్జిమెంట్ ఇస్తున్నారు.

అయితే షోలో కొన్ని ఎపిసోడ్స్ లో జడ్జెస్ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేస్తారు. తాజాగా ఇటీవల వచ్చిన ఓ ఎపిసోడ్ లో అనంత శ్రీరామ్ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. మొదట అమ్మాయిలతో కలిసి ఓ పాటకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మరో పాటకి మెల్లిగా స్టెప్పులు వేయడం మొదలు పెట్టి ఫాస్ట్ బీట్ స్టెప్స్, ఫ్లోర్ మూమెంట్స్, చేతులు కింద పెట్టి కాళ్ళు పైకి లేపి బొంగరంలా తిరుగుతూ డాన్స్ వేశారు.

Radheshyam : రాధేశ్యామ్ ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదానికి గురైన అభిమాని..

దీంతో అనంత శ్రీరామ్ డ్యాన్స్ చూసి షోలో ఉన్న వాళ్ళతో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. అనంత శ్రీరామ్ లో కనపడని ఈ ట్యాలెంట్ కూడా ఉందా, ఇన్నాళ్లు ఈ ట్యాలెంట్ ని దాచిపెట్టారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పాటలతో పాటు ఇప్పుడు డ్యాన్స్ తో కూడా అలరిస్తున్నారు అనంత శ్రీరామ్. మున్ముందు అనంత శ్రీరామ్ ఇంకెన్ని ట్యాలెంట్స్ చూపిస్తారో చూడాలి.