Raid : యాక్షన్ థ్రిల్లర్ ‘రైడ్’ సినిమా.. ఇప్పుడు ఆహా ఓటీటీలో..

తాజాగా ఆహా ఓటీటీలోకి మరో డబ్బింగ్ సినిమా వచ్చేస్తుంది.

Vikram Prabhu Sri Divya Raid Movie Streaming in Aha OTT Details Here

Raid : ఆహా ఓటీటీ ప్రతివారం కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలు తెస్తూనే ఉంది. డైరెక్ట్ సినిమాలే కాకుండా అనేక డబ్బింగ్ సినిమాలు, వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంది. తాజాగా ఆహా ఓటీటీలోకి మరో డబ్బింగ్ సినిమా వచ్చేస్తుంది. విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య మెయిన్ లీడ్స్ లో నటించిన సినిమా ‘రైడ్’ ఆహా ఓటీటీలోకి నేడు అక్టోబర్ 19 అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది.

Also Read : Unstoppable with NBK : మరోసారి బాలయ్య అన్‌స్టాపబుల్‌కి సీఎం చంద్రబాబు.. ఈసారి ఏ రేంజ్‌లో ఉండబోతుందో..

కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ టగరు సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా. కార్తీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ్ లో రిలీజయి హిట్ అవ్వగా ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ తో ఆహా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. భవానీ మీడియా ద్వారా రైడ్ సినిమా ఆహా ఓటీటీలో నేడు రాత్రి అక్టోబరు 19 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ సినిమాలో మ్యాడ్ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ కీలక పాత్ర పోషించింది.