తెలుగు సినిమాలు – వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి సందర్భంగా కొత్త సినిమాల అప్‌డేట్స్ భారీ స్థాయిలో వచ్చాయి.. ఫస్ట్ లుక్స్ అండ్ న్యూ పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్..

  • Publish Date - September 2, 2019 / 09:42 AM IST

వినాయక చవితి సందర్భంగా కొత్త సినిమాల అప్‌డేట్స్ భారీ స్థాయిలో వచ్చాయి.. ఫస్ట్ లుక్స్ అండ్ న్యూ పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్..

కొత్త సినిమాల ఓపెనింగ్స్, ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్.. ఏది రిలీజ్ చెయ్యాలన్నా ఓ స్పెషల్ అకేషన్ చూస్తుంటారు దర్శక, నిర్మాతలు.. వినాయక చవితి సందర్భంగా కొత్త సినిమాల అప్‌డేట్స్ భారీ స్థాయిలో వచ్చాయి. పండక్కి ఒకరోజు ముందే నటసింహా నందమూరి బాలకృష్ణ 105 న్యూ లుక్ పోస్టర్స్ రిలీజ్ చెయ్యగా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న ‘అల…వైకుంఠపురములో…’ ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

వినాయక చవితి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న హిస్టారికల్ మూవీ ‘సైరా’ నరసింహా రెడ్డి న్యూ పోస్టర్ విడుదల చేశారు. మాస్ మహారాజా రవితేజ.. ‘ఐ యామ్ ది రాజా.. డిస్కో రాజా’ అంటూ ఫస్ట్ లుక్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న స్పై థ్రిల్లర్ ‘చాణక్య’ దసరాకు విడుదల అంటూ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. అల్లరి నరేష్ ‘బంగారు బుల్లోడు’, వరుణ్ తేజ్ ‘వాల్మీకి’, సందీప్ కిషన్ ‘తెనాలి రామకృష్ణ BA.BL’, రాజు గారి గది 3 ఫస్ట్ లుక్’,  ధనుష్ ‘తూటా’, పాయల్ రాజ్‌పుత్ ‘RDX LOVE’ న్యూ పోస్టర్స్ రిలీజ్ చేశారు.

తమిళ్‌లో శివ కార్తికేయన్ నటిస్తున్న ‘హీరో’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మలయాళంలో నివీన్ పౌలి, నయనతార నటిస్తున్న ‘లవ్ యాక్షన్ డ్రామా’ న్యూ పోస్టర్ విడుదల చేసింది మూవీ టీమ్.. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘రంగ్‌దే’ మూవీ టీమ్స్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ సోషల్ మీడియా ద్వారా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపాయి.