Viral Pic Of The Week: సెలబ్రిటీల చమక్కులు

సోషల్ మీడియాలో ట్రెండ్ అయితే చాలు అదే పెద్ద మ్యాటర్. స్పెషల్ రోజు అయితే సరిపోదు ఎంత ఎక్కువమందికి స్పెషల్ అనిపించిందో దానికే క్రేజ్. అలా ఇనిస్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్లో ట్రెండ్ అయిన ఫొటోలు మీ ముందుకు..

 

రానా బర్త్ డే స్పెషల్: ఈ వీకెండ్ ను రానా బర్త్ డే, వెంకటేశ్ బర్త్ డే మెరిపించాయి. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రానాకు తొలి పుట్టినరోజు కావడంతో స్పెషల్ బర్త్ డే ఇది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి టాలీవుడ్ హీరోలు, అభిమానులంతా రానాను శుభాకాంక్షలతో ముంచెత్తారు. 

మహేశ్ ఫుల్ జోశ్:
సరిలేరు నీకెవ్వరు సినిమా పనుల్లో బిజీగా ఉన్న మహేశ్.. సోషల్ మీడియాను అదే రేంజ్ లో కవర్ చేశాడు. వర్కింగ్ స్టిల్స్ లో కండలతో ఉన్న ఫొటోలు, కూతురు సితారతో ముచ్చట్లు ఆడుతున్న ఫొటోలు, విజయశాంతితో కలిసి ఉన్న సినిమా పోస్టర్లు ట్రెండీగా మారాయి. 

శివం దూబె సిక్సర్లు
యువ క్రికెటర్ శివం దూబె అదరగొట్టాడు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో 30బంతుల్లో 4 సిక్సర్లు, 4 బౌండరీలతో స్కోరు బోర్డుకు చక్కటి ఊపందించాడు. కేరళలోని తిరువనంతపురం వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడిపోయినప్పటికీ శివం దూబె ప్రదర్శన హైలెట్ గా నిలిచింది. 

శ్రీదేవీ చిన్న కూతురి చిందులు:
పొట్టి పొట్టి డ్రస్సుల్లో జిమ్ కు వెళ్లి వచ్చే ఫొటోలే కాదు. శ్రీదేవీ శారీలోనూ కనిపించింది. డైరక్టర్-ప్రొడ్యూసర్ అమృత్‌పాల్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన పార్టీలో పసుపు రంగు చీరలో తళుక్కుమంది. అలనాటి తార శ్రీదేవీ చాందినీ సినిమాలో పసుపు చీరలో కనిపించినట్లుగానే ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు షికారు కొట్టాయి. 

దుమ్ముదులుపుతున్న బన్నీ:
త్రివిక్రమ్ స్టైల్ పంచ్ డైలాగులు, భారీ స్టార్ క్యాస్టింగ్ తో సిద్ధమవుతోంది అల వైకుంఠపురంలో.. షూటింగ్ పూర్తయిపోతుండగా ప్రమోషన్ ను ఫోకస్ చేసింది సినిమా యూనిట్. బన్నీ డైలాగ్ డెలీవరీలతో కొత్త లుక్ తో మాయ చేస్తుండగా సినిమా జనాల్లోకి దూసుకెళ్లిపోతుంది. షూటింగ్ లో త్రివిక్రమ్ తో పాటు బన్నీ ముచ్చట్లు పెట్టుకుంటున్న ఫొటో వైరల్ గా మారింది.