మంచు విష్ణు, విరానికా దంపతులకు నాలుగో సంతానంగా జన్మించిన పాపకు ‘ఐరా విద్య మంచు’ అని నామకరణం చేశారు..
యంగ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం తన పూర్తి టైమ్ ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తున్నాడు. మంచు విష్ణు భార్య విరానికా ఇటీవలే ఓ పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. ఈ జంటకు ఇప్పటికే ఆరియానా, వివియానా అనే ట్వన్స్‌తో పాటు అవ్రామ్ అనే బాబు కూడా ఉన్నాడు. వీరికి నాలుగో సంతానంగా జన్మించిన పాపకు ‘ఐరా విద్య మంచు’ అని నామకరణం చేశారు.
రీసెంట్‌గా పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను విరానికా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘మా ఐరా విద్య మంచు’.. అంటూ ఐరాతో పాటు మిగతా కిడ్స్ పిక్స్ కూడా షేర్ చేస్తూ.. ‘మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి’.. అంటూ పోస్ట్ చేసింది. మంచు విష్ణు కిడ్స్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : టెర్మినేటర్ : డార్క్ ఫీట్ – ట్రైలర్..
నెటిజన్స్ ఈ ఫోటోలను లైక్ చేస్తూ, ‘మీ కిడ్స్ చాలా క్యూట్‌గా ఉన్నారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మంచు విష్ణు త్వరలో నాలుగు కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.