Virata Parvam: ఆకట్టుకుంటున్న విరాటపర్వం నగాదారిలో సాంగ్ ప్రోమో
టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమాల్లో రానా దగ్గుబాటి, సాయి పల్లవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమా కూడా చాలా ఆసక్తిని క్రియేట్ చేసింది. ఈ సినిమా తెలంగాణలో జరిగిన కొన్ని....
- Anil Aaleti
- Published On : June 1, 2022 / 07:21 PM IST
Virata Parvam Nagaadarilo Song Promo Released
Virata Parvam: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమాల్లో రానా దగ్గుబాటి, సాయి పల్లవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమా కూడా చాలా ఆసక్తిని క్రియేట్ చేసింది. ఈ సినిమా తెలంగాణలో జరిగిన కొన్ని యధార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో రానా ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇక సాయి పల్లవి అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా ఈ సినిమాలో మరోసారి తనదైన మార్క్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేసేందుకు రెడీ అవుతోంది.
Virata Parvam: ముందుకు దూకిన విరాటపర్వం.. రిలీజ్ ఎప్పుడంటే?
కాగా.. ఈ సినిమా నుండి ‘నగాదారిలో..’ అనే పాటను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే ఈ సాంగ్ ప్రోమోను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫోక్ సింగర్ వరం పాడిన ఈ పాట గ్లింప్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుండటంతో, ఫుల్ సాంగ్ కోసం వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో వెన్నెల అనే పాత్రలో సాయి పల్లవి నటిస్తుండగా, రవి శంకర్ అలియాస్ రవన్న అనే కామ్రేడ్ పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. వీరి మధ్య సాగే ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందా అనేది సినిమా కథగా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.
Virata Parvam: ఫైనల్‌గా థియేటర్లలోకి విరాట పర్వం.. మ్యాజిక్ చేస్తుందా?
మరి విరాట పర్వం సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక నగాదారిలో అనే లిరికల్ సాంగ్‌ను రేపు ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా.. ఈ సినిమాను జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీవెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
