×
Ad

Virosh : విజయ్ – రష్మిక పెళ్ళికి ఎన్ని కోట్లు ఖర్చు అయింది..? విజయ్ ఆడిటర్ ఏమన్నాడంటే..

విజయ్ ఆడిటర్, CA, విజయ్ సన్నిహితుడు అనురాగ్ పర్వతనేని ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరి పెళ్లి గురించి, విజయ్ గురించి మాట్లాడాడు.(Virosh)

  • Published On : March 9, 2026 / 09:08 AM IST

Virosh

  • విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి ఖర్చు
  • విజయ్ ఆడిటర్ అనురాగ్ ఇంటర్వ్యూ
  • విజయ్ తో బంధం గురించి చెప్పిన అనురాగ్

Virosh : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి ఘనంగా జరిగింది. దాదాపు వారం రోజుల పాటు పెళ్లి వేడుకలను నిర్వహించారు. హల్దీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్, ఫ్యాన్స్ మీట్, మీడియా మీట్, అన్నదానాలు, స్వీట్స్ పంపిణి, టెంపుల్స్ విజిట్.. ఇలా పెళ్లి వేడుకలను ఘనంగా వారం రోజుల పాటు సెలబ్రేట్ చేసారు. ఈ పెళ్లి తంతు చూస్తే దీనికి బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.

తాజాగా విజయ్ ఆడిటర్, CA, విజయ్ సన్నిహితుడు అనురాగ్ పర్వతనేని ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరి పెళ్లి గురించి, విజయ్ గురించి మాట్లాడాడు.

Also Read : Prithvi Shaw : ఇండియా వరల్డ్ కప్ గెలిచిన వేళ.. టాలీవుడ్ హీరోయిన్ తో క్రికెటర్ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..

Virosh

అనురాగ్ మాట్లాడుతూ.. ఆసియాలో బిగ్గెస్ట్ వెడ్డింగ్ ఇది. విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ పోస్ట్ కి ఎక్కువ లైక్స్ వచ్చాయి. ఆసియా లో హైయెస్ట్ అదే మొన్నటివరకు. ఇపుడు అది రష్మిక బీట్ చేసింది. రష్మిక పోస్ట్, విజయ్ పోస్ట్ కి కలిపి 46 మిలియన్స్ లైక్స్ వచ్చాయి. రష్మిక కు 26 మిలియన్ లైక్స్, విజయ్ కి 21 మిలియన్ లైక్స్ వచ్చాయి. విజయ్ – రష్మిక చేసిన మాన్యువర్ యాడ్ కి యూట్యూబ్ లో 34 మిలియన్స్ వచ్చాయి. ఒక కపుల్ చేసిన యాడ్ కి ఇన్ని వ్యూస్ రావడం వరల్డ్ లోనే ఇదే హైయెస్ట్. పెళ్లికి ముందు షూట్ చేసినా పెళ్లి ప్రమోషన్ లాగే చేసాము పెళ్లి తర్వాతే రిలీజ్ చేసాము. వాళ్ళ పెయిర్ కి అంత ఇమేజ్, పాపులారిటీ ఉంది. ఒక ఆడిటర్ గా ఖర్చు విషయాలు చెప్పకూడదు, కాన్ఫిడెన్షియల్. కానీ లిమిటెడ్ గానే ఖర్చు అయింది అని అన్నారు.

టాలీవుడ్ సమాచారం ప్రకారం విజయ్ – రష్మిక పెళ్ళికి దాదాపు 20 నుంచి 25 కోట్ల వరకు అయింది అని తెలుస్తుంది. అయితే మాన్యువర్ యాడ్ ని పెళ్లి ప్రమోషన్, పెళ్లి తర్వాత ఫస్ట్ యాడ్ గా చేయడంతో దీనికి రెమ్యునరేషన్స్ భారీగా తీసుకున్నారట. ఇద్దరికీ కలిపి మాన్యువర్ యాడ్ కి దాదాపు 15 కోట్లకు పైగానే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ యాడ్ కి వచ్చినవి పెళ్ళికి ఖర్చుపెట్టుకొని మిగిలిన డబ్బులు విజయ్, రష్మికలు పెట్టుకున్నారట.

Also Read : Vijay Rashmika : పెళ్లి హడావిడి అయిపోయింది.. బ్యాక్ టు వర్క్.. ఇద్దరూ ఒకే సినిమా సెట్లోకి..

అలాగే అనురాగ్ విజయ్ తో ఉన్న బంధం గురించి మాట్లాడుతూ.. 2017 అర్జున్ రెడ్డి సమయంలో వాళ్ళ నాన్న ద్వారా ఆయన దగ్గర ఎంటర్ అయ్యా. అప్పట్నుంచి వాళ్లకు అన్నీ చేస్తున్నాను మనీ రిలేటెడ్ విషయాలు. విజయ్ తో జర్నీ పెరిగింది. చాలా మంది సినిమా వాళ్ళు నా క్లైంట్స్ అయ్యారు. విజయ్ నిర్మాణ సంస్థ పెట్టిన తర్వాత ఆయన వల్ల ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యాను. ఆ తర్వాత కో ప్రొడ్యూసర్ అయ్యాను. నా లైఫ్ విజయ్ కి ముందు విజయ్ కి తర్వాత అని చెప్పొచ్చు. విజయ్ కంటే వాళ్ళ నాన్న బాస్ నాకు. రోజులో నాకు సగం దేవరకొండ ఫ్యామిలీనే. నా రోజులో సగం వర్క్ విజయ్, ఆనంద్, రశ్మికకే చేస్తాను. పెళ్ళికి ముందు నుంచి అయితే మొత్తం డే విజయ్ ఫ్యామిలీకి అంకితం అయిపోయింది. ఇప్పుడు విజయ్ రణబాలి సినిమాకు కూడా కో ప్రొడ్యూసర్ గా చేస్తున్నా. తర్వాత నిర్మాతగా కూడా చేస్తున్నా అని తెలిపారు.