Visa – Vintara Saradaga : ‘వింటారా సరదాగా’ రిలీజ్ డేట్ ఫిక్స్..
Visa – Vintara Saradaga : మహేశ్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్, శ్రీ గౌరీ ప్రియా జంటగా నటిస్తున్న చిత్రం ‘వీసా – వింటారా సరదాగా’.
- Thota Vamshi Kumar
- Published on- November 14, 2026 / 11:47 AM IST
Visa – Vintara Saradaga movie release date fix
Visa – Vintara Saradaga : మహేశ్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్, శ్రీ గౌరీ ప్రియా జంటగా నటిస్తున్న చిత్రం ‘వీసా – వింటారా సరదాగా’. ఉద్భవ్ రఘు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. యూత్‌ఫుల్ లవ్, ఫ్రెండ్‌షిప్, ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందిన ఈ చిత్రం 2027 నూతన సంవత్సరం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
2027 జనవరి 1 ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని చెబుతూ చిత్ర బృందం ప్రత్యేకంగా పోస్టర్‌ను విడుదల చేసింది. కాగా.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు టీజర్లు సినిమాపై మంచి ఆసక్తిని పెంచాయి.
Yash-Aditya dhar : యశ్‌తో ధురంధర్ దర్శకుడి భారీ ప్రాజెక్ట్?
ఉన్నతమైన కలలను సాకారం చేసుకోవాలనే ఆశయంతో స్వదేశాన్ని విడిచి అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థుల జీవితాల చుట్టూ కథనం సాగుతుంది. విదేశాల్లో విద్యార్థుల జీవనశైలి, స్నేహాలు, ప్రేమలు, అనుకోని సంఘటనలు, ఎదురయ్యే ఆసక్తికరమైన పరిస్థితులను వినోదాత్మకంగా ఈ సినిమాలో ఆవిష్కరించారు.
రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, వైవా హర్ష.. పలువురు కీలక పాత్రలను పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఎస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
