Yash-Aditya dhar : యశ్‌తో ధురంధర్ దర్శకుడి భారీ ప్రాజెక్ట్?
Yash-Aditya dhar : యశ్, ఆదిత్య ధర్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనుందనే వార్తలు వస్తున్నాయి.
Aditya dhar plans a historical epic with Yash
Yash-Aditya dhar : ధురంధర్-2 గ్రాండ్ సక్సెస్ తర్వాత డైరెక్టర్ ఆదిత్య ధర్ పేరు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారిపోయింది. ధురంధర్-2తో బాక్సాఫీస్ దగ్గర రికార్డుల సునామీ సృష్టించిన ఈ దర్శకుడు.. తర్వాత ఓ పెద్ద ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్నాడట. కన్నడ స్టార్, కేజీఎఫ్‌తో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న యశ్‌తో బిగ్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట.
ఈ పిక్చర్ యశ్, ఆదిత్య ధర్ ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండబోతోందని, యశ్ రోల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని అప్పుడే సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాకింగ్ స్టార్ యశ్‌ను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్ సంప్రదించినట్లు తెలుస్తోంది. భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన చక్రవర్తుల్లో ఒకరైన చంద్రగుప్త మౌర్య జీవిత కథ ఆధారంగా ఓ భారీ హిస్టారికల్ మూవీ తెరకెక్కించాలనే ఆలోచనలో ఆదిత్య ధర్ ఉన్నాడట, ఈ కథలో ప్రధాన పాత్ర కోసం యశ్‌ను ఎంపిక చేసే దిశగా చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Lavanya Tripathi : శ్రీవారిని దర్శించుకున్న నటి లావణ్య త్రిపాఠి.. ఫోటోలు..
ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యశ్, ఆదిత్య ధర్ వంటి దర్శకుడితో చేతులు కలిపితే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరో స్థాయికి చేరడం ఖాయం. భారీ యుద్ధ సన్నివేశాలు, రాజసం ఉట్టిపడే నేపథ్యం, చంద్రగుప్త మౌర్య సామ్రాజ్య చరిత్రతో ఈ సినిమా తెరకెక్కితే బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
టాక్సిక్ మూవీ డిజాస్టర్ కావడంతో యశ్ కూడా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాడట. రామాయణం సినిమాలో యశ్ రావణుడి పాత్రలో ఆకట్టుకున్నా.. ఆయనే హీరోగా కేజీఎఫ్ తలపించే సక్సెస్ కొట్టి తీరాలని కసితో ఉన్నాడట యశ్. ఆదిత్య ధర్ కూడా యశ్‌కు ఉన్న నేషనల్ ఎక్స్పోజర్ దృష్యా పాన్ ఇండియా రేంజ్ మూవీకి ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఈ కాంబో సెట్ అయితే మాత్రం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరో క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కడం ఖాయమన్న ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి.
