Vishal : మరోసారి షూటింగ్ లో గాయపడిన విశాల్.. రెండోసారి ఆగిపోయిన షూటింగ్..
ప్రస్తుతం విశాల్ లాఠీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. గతంలో కూడా ఈ సినిమా షూటింగ్ సమయంలో విశాల్ గాయపడ్డాడు. అప్పుడు కొన్ని రోజులు..........
- Saketh U
- Published on- July 4, 2022 / 01:54 PM IST
Vishal
Vishal : సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ల కోసం కొంతమంది హీరోలు నిజంగా రిస్క్ చేస్తారు. అలాంటి హీరోల్లో విశాల్ ఒకరు. చాలా వరకు విశాల్ ఫైట్ సీక్వెన్స్ లలో డూప్ లేకుండానే చేసి అభిమానులను మెప్పిస్తాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ ల వల్ల ఇప్పటికే చాలా సార్లు గాయలపాలయ్యాడు విశాల్.
ప్రస్తుతం విశాల్ లాఠీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. గతంలో కూడా ఈ సినిమా షూటింగ్ సమయంలో విశాల్ గాయపడ్డాడు. అప్పుడు కొన్ని రోజులు షూటింగ్ నిలిచిపోయింది. తాజాగా మరోసారి ఇదే సినిమా షూటింగ్లో విశాల్ తీవ్రంగా గాయపడ్డాడు. ‘లాఠీ’ సినిమా క్లైమాక్స్ ఫైట్ సీన్స్ హైదరాబాద్ లో తెరకెక్కుస్తుండంగా ప్రమాదం చోటు చేసుకొని విశాల్ కి గాయాలయ్యాయి. దీంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. అభిమానులు విశాల్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ ప్రమాదంతో సినిమా మరింత ఆలస్యం అవనుంది.
