Laththi: బుల్లితెరపై పోలీసోడి లాఠీ పవర్ చూపెట్టేందుకు సిద్ధమైన విశాల్!

తమిళ హీరో విశాల్ నటించే సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే ఆయన నటించే ప్రతి సినిమాను తెలుగులో ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంటారు. ఇక ఈ హీరో ఇటీవల వరుసగా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలతో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వెళ్తున్నాడు. అయితే చాలా వరకు విశాల్ నటించే సినిమాలు మిక్సిడ్ రెస్పాన్స్ వస్తున్నా, కలెక్షన్లు మాత్రం రావడం లేదు. రీసెంట్‌గా విశాల్ నటించిన పోలీస్ యాక్షన్ డ్రామా మూవీ ‘లాఠీ’ రిలీజ్‌కు ముందు మంచి అంచనాలను క్రియేట్ చేసింది.

Laththi: తమిళ హీరో విశాల్ నటించే సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే ఆయన నటించే ప్రతి సినిమాను తెలుగులో ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంటారు. ఇక ఈ హీరో ఇటీవల వరుసగా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలతో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వెళ్తున్నాడు. అయితే చాలా వరకు విశాల్ నటించే సినిమాలు మిక్సిడ్ రెస్పాన్స్ వస్తున్నా, కలెక్షన్లు మాత్రం రావడం లేదు. రీసెంట్‌గా విశాల్ నటించిన పోలీస్ యాక్షన్ డ్రామా మూవీ ‘లాఠీ’ రిలీజ్‌కు ముందు మంచి అంచనాలను క్రియేట్ చేసింది.

Vishal Laththi : యాక్షన్ సీక్వెన్స్ కోసం డేర్ చేసిన విశాల్.. విరిగిన ఎముకలు

ఈ సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేయగా, పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో విశాల్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దర్శకుడు ఎ.వినోద్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమా ప్రస్తుతం వరల్డ్ టెలివిజన్ ప్రీమయర్‌కు సిద్ధమైనట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్ర శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న సన్ టీవీ ఈ మేరకు అనౌన్స్‌మెంట్ చేసింది.

Vishal : మరోసారి షూటింగ్ లో గాయపడిన విశాల్.. రెండోసారి ఆగిపోయిన షూటింగ్..

లాఠీ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 16న సన్ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విశాల్ నటించగా, సునైనా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు సామ్ సిఎస్ సంగీతం అందించాడు. మరి బుల్లితెరపై ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు