×
Ad

Vishal – Prabhas : ప్రభాస్‌ని హీరోగా పెట్టి డిఫరెంట్ జోనర్‌లో.. సినిమా డైరెక్ట్ చేస్తానంటున్న విశాల్..

ప్రభాస్‌ని హీరోగా పెట్టి డిఫరెంట్ జోనర్‌లో సినిమా డైరెక్ట్ చేస్తానంటున్న విశాల్. 'రత్నం' మూవీ ప్రమోషన్స్ లో ఉన్న విశాల్..

  • Published On : April 19, 2024 / 04:47 PM IST

Vishal says he would direct a movie with Prabhas in Rathnam movie promotions

Vishal – Prabhas : కోలీవుడ్ హీరో విశాల్ ‘రత్నం’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. హరి దర్శకత్వం వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 25న తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. దీంతో విశాల్ తెలుగు స్టేట్స్ లో కూడా ప్రమోషన్స్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే రీసెంట్ గా హైదరాబాద్ లో ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఇక ఈ ఈవెంట్ లో విశాల్.. ప్రభాస్ తో ఓ సినిమా డైరెక్ట్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు. విశాల్ తన సూపర్ హిట్ మూవీ ‘డిటెక్టివ్’కి సీక్వెల్ తీసుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ ని తానే డైరెక్ట్ చేస్తూ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇక దర్శకుడిగా భవిషత్తులో ఇతర హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం ఉందా..? ఉంటే తెలుగులో ఏ హీరోని డైరెక్ట్ చేస్తారు..? అంటూ ప్రశ్నించారు.

Also read : Puri Musings : అక్కడ కరెంట్ కూడా ఉండదు.. 18వ శతాబ్దం జీవన శైలితోనే.. పూరి చెప్పిన ఆ ప్రజలు ఎవరు..?

దీనికి విశాల్ బదులిస్తూ.. “ప్రభాస్ తో చేస్తాను. ప్రభాస్ అంటే యాక్షన్ ఫిలిమ్స్ చేస్తాడు. డార్లింగ్ వంటి లవ్ మూవీస్ చేస్తాడని అందరికి తెలుసు. అలాంటి తనని ఓ కొత్త జోనర్ లో చూపిస్తూ సినిమా చేస్తాను” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

రత్నం మూవీ విషయానికి వస్తే.. భరణి, పూజ వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత విశాల్ మరోసారి దర్శకుడు హరితో కలిసి చేస్తున్న సినిమా ఇది. ప్రియా భవాని శంకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకొని సినిమా పై మంచి అంచనాలనే క్రియేట్ చేసాయి. మరి మూవీ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.