Vishnu Priya : ఇండస్ట్రీలో మగవాళ్ల డామినేషన్.. నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. నన్ను యాంకర్ అని పిలవకండి..
విష్ణుప్రియ మాట్లాడుతూ.. ''సినీ పరిశ్రమలో మగవాళ్ల డామినేషన్ ఉంది. ఇప్పుడిప్పుడే ఆడవాళ్లు బయటకి వస్తున్నారు. సినిమాల్లోనే కాదు అన్ని రంగాల్లో.............
- Saketh U
- Published On : September 18, 2022 / 07:20 AM IST
Vishnu Priya spoke about casting couch in industry
Vishnu Priya : షార్ట్ ఫిలిమ్స్ తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత యాంకర్ గా ఎదిగి ఇప్పుడు సినిమాలు చేస్తుంది విష్ణుప్రియ. ఇక సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలతో, వీడియోలతో అలరిస్తుంది. ఇటీవలే ఓ మాస్ సాంగ్ కి మానస్ తో కలిసి స్టెప్పులేసింది విష్ణుప్రియ. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.
విష్ణుప్రియ మాట్లాడుతూ.. ”సినీ పరిశ్రమలో మగవాళ్ల డామినేషన్ ఉంది. ఇప్పుడిప్పుడే ఆడవాళ్లు బయటకి వస్తున్నారు. సినిమాల్లోనే కాదు అన్ని రంగాల్లో ఆడవాళ్లు రాణిస్తున్నారు. ఒక 15-20 ఏళ్ల తర్వాత కచ్చితంగా ఆడవాళ్ళ డామినేషన్ ఉంటుంది” అని తెలిపింది.
విష్ణుప్రియ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ..”కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ పరిశ్రమలోనే కాదు అన్ని చోట్ల ఉంది. కానీ అది మన చేతుల్లోనే ఉంటుంది. కాస్టింగ్ కౌచ్ కి సమాధానం అమ్మాయి వ్యక్తిగతం. కెరీర్ ఆరంభంలో ఆఫర్స్ కోసం చూస్తున్నప్పుడు నన్ను కూడా చాలా మంది అడిగారు. నేను కూడా కాస్టింగ్ కౌచ్ ని ఫేస్ చేశాను. దానివల్ల చాలా ఆఫర్లు వదులుకోవాల్సి వచ్చింది కూడా” అని చెప్పింది.
”నాకు యాంకర్ ట్యాగ్ వద్దు. అలా పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదు. తెలుగులో నాకంటే అందంగా, నాకంటే బాగా మాట్లాడేవాళ్ళు చాలా మంది యాంకర్స్ ఉన్నారు. వారితో సమానంగా యాంకర్ అని నేను పిలిపించుకోలేను” అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విష్ణుప్రియ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చగా మారాయి.
