Vishwa
Bigg Boss 5 : బిగ్ బాస్ మొదలై 9 వారాలు గడిచిపోయింది. 19 మందితో మొదలైన బిగ్ బాస్ ఒక్కొక్కరుగా ఒక్కో వారం వెళ్లిపోతున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి సరయు, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ, లోబో, ప్రియాలు ఎలిమినేట్ అయ్యారు. ఇక గత వారం కెప్టెన్ షన్ను తప్ప అందరూ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఆ తర్వాత యాని మాస్టర్, మానస్ స్పెషల్ పవర్ తో సేఫ్ అయ్యారు. దీంతో ఈ వారం శ్రీరామచంద్ర, కాజల్, సన్నీ, సిరి, జెస్సీ, యాంకర్ రవి, విశ్వ, ప్రియాంక నామినేట్ అయ్యారు.
Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. బర్త్ డే స్పెషల్ స్టోరీ..
ఎప్పటిలాగే శ్రీరామ్, యాంకర్ రవి, సన్నీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఓట్లు బాగానే పడి సేవ్ అయిపోయారు. జెస్సీకి హెల్త్ బాగా లేకపోయినా ఆడాడు అనే సింపతీ తో ఓట్లు బాగానే పడినట్టు తెలుస్తుంది. సిరి గత వారమే ఎలిమినేషన్ చివరి వరకు వెళ్లి వచ్చింది కాబట్టి ఈ సారి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండదు. అమ్మాయిలు ఇంకొన్ని రోజులు ఉండాలి కాబట్టి ప్రియాంకని, కాజల్ ని ఉంచే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే గత వారం విశ్వ ఎక్కువగా ఆడినట్టు కనిపించలేదు. ఈ వారం విశ్వకి ఓట్లు కూడా తక్కువ పడినట్టు సమాచారం. దీంతో ఈ వారం విశ్వ ఎలిమినేట్ అవుతున్నట్టు తెలుస్తుంది.
Suneel : ‘మంగళం శ్రీను’గా భయపెడుతున్న సునీల్
రెండుసార్లు కెప్టెన్ అయిన విశ్వ ఈ సారి మాత్రం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేకపోయాడు. మాట్లాడితే ఏడవడం, ఫిజికల్‌గా దాడి చేయడం లాంటివి విశ్వకి నెగిటివ్ అయ్యాయి. దీంతో ఈ వారం విశ్వ ఎలిమినేట్ అవ్వనున్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో విశ్వని హౌస్ లో హీరోగా ప్రకటించి ఇవాళ ఎలిమినేట్ చేయబోతుండటం విశేషం.