Vishwak Sen : బుల్లితెర సూపర్ హిట్ డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే పలు సీజన్స్ విజయంతంగా పూర్తి చేసుకున్న ఈ ఢీ షో తాజా సీజన్ ఇప్పుడు ఫైనల్స్ కి చేరింది. తాజాగా ఈ షో కి సంబందించిన ప్రోమో రిలీజ్ చేసారు నిర్వాహకులు. ఇక ఈ షోకి గణేష్ మాస్టర్, నటి హన్సిక, శేఖర్ మాస్టర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.
Also Read : Unstoppable With NBK : అన్‌స్టాపబుల్.. అల్లు అర్జున్ ఎపిసోడ్ కి రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్..
తాజాగా రిలీజ్ చేసిన ఫైనల్ ఎపిసోడ్ ప్రోమో లో కంటెస్టెంట్స్ అందరూ తమ తమ పర్ఫామెన్స్ లతో అదరగొట్టారు. ఢీ ఫైనల్స్ ట్రోఫీ ఎవరికి దక్కుతుంది అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా విన్నర్ కి ట్రోఫీ అందించడానికి టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వచ్చాడు. ఆయన నటించిన మెకానిక్ రాకీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ షో కి మెకానిక్ రాకీ పాత్రలోనే వచ్చాడు విశ్వక్. రాగానే హన్సిక ను తన మాటలతో మాయ చేసాడు. అలాగే హైపర్ ఆది పంచ్ లకి రివర్స్ పంచ్ లు వేసి నవ్వులు పూయించారు.
ఇక ఇప్పటికే ఢీ గత సీజన్ల ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ లుగా చాలా మంది స్టార్ హీరోస్ వచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాని ఇలా చాలా మంది స్టార్ హీరోస్ వచ్చారు. తాజాగా ఇప్పుడు ఈ సీజన్ కి విశ్వక్ వచ్చి ఆకట్టుకున్నాడు. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారు..? ఎవరికి విశ్వక్ ట్రోఫీ అందిస్తాడో చూడాలి. ఇక విశ్వక్ నటించిన మెకానిక్ రాకీ సినిమా నవంబర్ 22 న విడుదలై మంచి సక్సెస్ అందుకుంది.