Vishwak sen funky movie ott release update
Funky OTT: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన జానర్ ని పూర్తిగా మార్చేసి ఫన్ జోన్ లో చేసిన సినిమా ఫంకీ. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ తెరకెక్కించిన ఈ సినిమాలో కాయదు లోహార్ హీరోయిన్ గా నటించింది. నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుదీప్ స్టైల్ సెటైరికల్ కామెడీతో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటీవ్ టాక్ రాలేదు.
Shivaji: యాదగిరిగుట్టలో 70 వేల స్థలం.. రూ.1800 కోట్ల నష్టం.. కేవలం దానికోసమే చేశాను
సినిమాలో అక్కడక్కడా అనుదీప్ పంచ్ లు పేలినప్పటికీ ఓవరాల్ గా ఆడియన్స్ మాత్రం ఈ సినిమాతో డిజప్పాయింట్ అయ్యారు అనే చెప్పాలి. దాంతో, కలెక్షన్స్ కూడా అంతే ఫేలవంగా రాబట్టింది ఈ సినిమా. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఓపెనింగ్స్ చాలా డల్ గా స్టార్ట్ అవగా ఫైనల్ గా రూ.7 కోట్ల షేర్ కలెక్షన్స్ మాత్రమే ఫంకీ సినిమా రాబట్టినట్టుగా సమాచారం.
దీంతో, ఇప్పుడు ఫంకీ(Funky OTT) సినిమా ఓటీటీ రిలీజ్ పై కొన్ని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫంకీ సినిమాను ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం సినిమా రిలీజ్ అయిన నెలరోజుల తరువాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలి. కాబట్టి, మార్చి 12 లేదా 13 తేదీలలో ఫంకీ సినిమా ఓటీటీలో వచ్చే అవకాశం ఉంది. అయితే, ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక విశ్వక్ సేన్ సినిమాల విషయానికి వస్తే, ఫంకీ తరువాత ఆయన చేస్తున్న సినిమా ENE 2(ఈ నగరానికి ఏమైంది 2). సూపర్ హిట్ ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.