Ashoka Vanamlo Arjuna Kalyanam: విశ్వక్ సేన్ విశ్వప్రయత్నాలు.. ఫలించేనా?
ఫలక్ నుమా దాస్ తర్వాత మాస్ కా దాస్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్. ఆ తర్వాత ఏ సినిమా చేసినా ఏదో చేయాలనుకుంటే ఇంకేదో అయినట్టే అవుతుంది.
- Naresh Mannam
- Published On : May 3, 2022 / 05:06 PM IST
Vishwaksen
Ashoka Vanamlo Arjuna Kalyanam: ఫలక్ నుమా దాస్ తర్వాత మాస్ కా దాస్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్. ఆ తర్వాత ఏ సినిమా చేసినా ఏదో చేయాలనుకుంటే ఇంకేదో అయినట్టే అవుతుంది. దాంతో లేటెస్ట్ సినిమాతో ఎలాగైనా మాస్ సక్సెస్ కొట్టాలని చూస్తున్న విశ్వక్ సేన్.. పబ్లిసిటీ కోసం వెరైటీగా ప్లాన్ చేశాడు. ఇంతకీ ఏ సినిమా కోసం చేశాడు? ఏం ప్లాన్ చేశాడు? డిటైల్డ్ స్టోరీలో చూద్దాం.
Ashoka Vanamlo Arjuna Kalyanam : ‘ఓ ఆడపిల్లా.. నువ్వర్థం కావా?..నా జీవితంతో ఆటాడుతావా?’..
విశ్వక్ సేన్ హీరోగా ఈ నెల 6న రిలీజ్ కాబోతున్న సినిమా అశోక వనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమాలో రుక్షర్ ఢిల్హాన్ హీరోయిన్ గా నటిస్తోంది. విద్యాసాగర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సుధీర్, బాపినీడు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కొత్తగా ట్రై చేయాలనుకుని, కాంట్రవర్శిలో చిక్కుకున్నాడు మాస్ కా దాస్.
Ashoka Vanamlo Arjuna Kalyanam : అల్లం గారి పెళ్లి కూతుర్ని చూశారా..
ఇలా నడి రోడ్డు మీద ప్రాంక్ వీడియో చేసి, అడ్డంగా బుక్కయ్యాడు. కామన్ పబ్లిక్ ఈ వీడియో షూటింగ్ టైమ్ లో్ చాలా ఇబ్బంది పడ్డారు. ఓ అడ్వకేట్ ఈ ప్రాంక్ వీడియోను సీరియస్ గా తీసుకుని, విశ్వక్ సేన్ పై చర్యలు తీసుకోవాలని హెచ్ ఆర్సీకి ఫిర్యాదు చేశారు. సినిమాకి ప్లస్ అవుతుందనుకుంటే ఇలా అడ్డం తిరిగింది విశ్వక్ సేన్ ప్రమోషనల్ ఐడియా. టీజర్, ట్రయిలర్, సాంగ్స్ తో అఫిషియల్ గా ఈ సినిమా ప్రమోషన్స్ పీక్స్ లోనే ప్లాన్ చేస్తున్నారు టీమ్.
Vishwak Sen : అనుకోకుండా అన్నాను అంటూ.. సారీ చెప్పిన విశ్వక్ సేన్..
మే 3న ఖమ్మంలో గ్రాండ్ ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు. అయినా విశ్వక్ సేన్ ఇలాంటి ట్రిక్స్ ఎందుకు ప్లే చేస్తున్నాడో అని ఫీలవుతున్నారు ఆయన ఫ్యాన్స్. సినిమా సక్సెస్ కోసం మంచి కంటెంట్ ఉండాలి కాని, ఇలాంటి ఛీప్ ట్రిక్స్ తో విశ్వ ప్రయత్నాలు చేసినా సక్సెస్ రాదని కామన్ ఆడియన్స్ రియాక్ట్ అవుతున్నారు.
