Vishwak Sen: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ‘దాస్ కా ధమ్కీ’ అంటూ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేశాడు.
GAAMI: ‘గామి’తో మరో ప్రయోగం.. అఘోరాగా విశ్వక్ సేన్!
అయితే, విశ్వక్ సేన్ గతంలో ‘గామి’ అనే సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. కానీ రోజులు గడుస్తున్నా, ఈ సినిమా పూర్తి కాకపోవడంతో ఈ మూవీ గురించి అందరూ మర్చిపోయారు. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ను చిత్ర యూనిట్ ఇచ్చింది. గామి మూవీ షూటింగ్‌ను ఎట్టకేలకు ముగించినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది. ఈమేరకు షూటింగ్ కంప్లీట్ అయినట్లుగా హీరోయిన్ చాందిని చౌదరి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది.
Vishwak Sen : విశ్వక్ సేన్ కొత్త లుక్.. VS11 లాంచ్ గ్యాలరీ!
విద్యాధర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ మూవీలో విశ్వక్ ఓ అఘోర పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. కార్తీక్ శబరీష్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
Gaami is finally a wrap! Can’t wait for the world to witness this fantastic film we made 🔥 pic.twitter.com/a9v7E6SytL
— Chandini Chowdary (@iChandiniC) May 1, 2023