GAAMI: ‘గామి’తో మరో ప్రయోగం.. అఘోరాగా విశ్వక్ సేన్!

కెరీర్ ప్రారంభం నుండే ఇటు మాస్ సినిమాలతో పాటు వైవిధ్యమైన కథలతో సినిమాలను ఎంచుకుంటున్న విశ్వక్ సేన్ ఇప్పుడు మరో భిన్నమైన కథతో వస్తున్నాడు. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నామా దాస్, హిట్...

GAAMI: ‘గామి’తో మరో ప్రయోగం.. అఘోరాగా విశ్వక్ సేన్!

Gaami

Updated On : October 18, 2021 / 3:04 PM IST

GAAMI: కెరీర్ ప్రారంభం నుండే ఇటు మాస్ సినిమాలతో పాటు వైవిధ్యమైన కథలతో సినిమాలను ఎంచుకుంటున్న విశ్వక్ సేన్ ఇప్పుడు మరో భిన్నమైన కథతో వస్తున్నాడు. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నామా దాస్, హిట్, పాగల్ వంటి సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ ‘గామి’ అంటూ మరో ప్రయోగం చేస్తున్నాడు. ఇది మరో సరికొత్త జోనర్ గా తెలుస్తుండగా.. ఇందులో హీరో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

Telugu Films Releases: టార్గెట్ డిసెంబర్.. అందరి చూపు ఈనెలపైనే!

తాజాగా ఈ చిత్ర గ్లింప్స్ పేరుతో టీజర్ విడుదల అయింది. అద్భుతమైన టెక్నికల్ వ్యాల్యూస్.. అత్యున్నతమైన విజువల్స్ తో టీజర్ ఆకట్టుకుంటుంది. టీజర్ లో విశ్వక్ కనిపించకపోయినా టీజర్ షాట్స్ లో కొత్త ఫీల్ కనిపించింది. విద్యాధర్ కాగిట ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా V సెల్యులాయిడ్, కార్తీక్ శబరిష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

Telugu Films: దండయాత్ర.. ఇది బాలీవుడ్ మీద తెలుగు హీరోల దండయాత్ర!

ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన చాందిని చౌదరి, అభినయ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చూసేందుకు కాస్త దూకుడుగా కనిపించే విశ్వక్ కథల ఎంపికలో మాత్రం కొత్తదనాన్ని వెతుక్కుంటున్నాడు. ఒక విధంగా ఇది కెరీర్ లో ఎదిగేందుకు ఉపయోగపడుతుందనే ఆలోచన కావచ్చు. మరి అఘోరాగా విశ్వక్ ఎలా ఆకట్టుకుంటాడో.. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటో మరికొన్ని రోజులు గడిచి సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ బయటకి వస్తేకానీ తెలియదు.