Vishwak Sen: ఎన్టీఆర్ పుణ్యమా అని.. దేవర బ్యానర్ లో విశ్వక్ సేన్ హీరోగా.. దానికి ప్లాప్ డైరెక్టరే దొరికాడా!
డిజాస్టర్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్న విశ్వక్ సేన్(Vishwak Sen).
- V Santhosh Kumar
- Published On : February 18, 2026 / 11:52 AM IST
Vishwak Sen new movie in Yuvasudha Arts banner
Vishwak Sen: విశ్వక్ సేన్ టైం ఏంటో అస్సలు బాలేదు. అవకాశాలు వస్తున్నాయి కానీ, హిట్స్ మాత్రం పడటం లేదు. గత ఏడాది లైలా సినిమాతో కెరీర్ లోనే భారీ డిజాస్టర్ అందుకున్నాడు ఈ హీరో. ఆ దెబ్బతో ఏడాది పాటు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాడు. ఆ తరువాత దర్శకుడు అనుదీప్ తో ఫంకీ సినిమాను మొదలుపెట్టాడు. ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్సుడ్ టాక్ వచ్చింది. కామెడీ బాగానే వర్కౌట్ అయినా కథ చాలా సిల్లీ గా ఉంది అంటూ ఆడియన్స్ ఫీలయ్యారు. దాంతో, ఫంకీ సినిమా కూడా తాను అనుకున్న రిజల్ట్ ను విశ్వక్ కి అందించలేదు. ఈనేపథ్యంలో విశ్వక్ సేన్(Vishwak Sen) నెక్స్ట్ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Naga Chaitanya: మరో క్రేజీ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్.. నాగ చైతన్య లైనప్ మాములుగా లేదుగా!
అదేంటి అంటే, దేవర సినిమా నిర్మాత సుధాకర్ మిక్కిలినేని విశ్వక్ సేన్ తో సినిమా చేసేందుకు ముందుకు వచ్చాడట. ఆ ప్రాజెక్టును ఎన్టీఆర్ ఆజ్ఞతో సుధాకర్ చేస్తున్నాడు అని టాక్ నడుస్తోంది. ఏ ఈ ప్రెజెక్టు కోసం తమిళ దర్శకుడు రజత్ చెప్పిన కథను ఒకే చేశారట. రజత్ గతంలో కార్తీ హీరోగా వచ్చిన దేవ్ సినిమాను చేశాడు. ఈ సినిమా ఎప్పుడు వచ్చింది అనేది కూడా చాలా మందికి తెలియదు.
అంతలా డిజాస్టర్ అయ్యింది ఈ సినిమా. రీసెంట్ గా రజత్ చెప్పిన కథ బాగా నచ్చడంతో విశ్వక్ కూడా ఈ సినిమా చేసేందుకు ఒకే చెప్పేశాడట. త్వరలోనే ఈ ప్రెజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రాజెక్టు విషయంలో టాలీవుడ్ ఆడియన్స్ సోషల్ మీడియాలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, దేవర లాంటి సినిమా చేసిన నిర్మాతకు అంతకన్నా వేరే దర్శకుడు దొరకలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకంటాడు అనేది చూడాలి.
