×
Ad

VishwakSen Vs SKN : ‘కల్ట్’ వర్సెస్ ‘కల్ట్ బొమ్మ’.. విశ్వక్ సేన్, బేబీ నిర్మాతల మధ్య టైటిల్ వివాదం? ఎవరేమన్నారంటే?

తాజాగా ఇప్పుడు ఓ టైటిల్ సినీ పరిశ్రమలో వైరల్ అవుతుంది.

  • Published On : December 30, 2023 / 09:09 PM IST

VishwakSen Movie Title Cult and Producer SKN Movie Titles Cult Bomma Issue Details

VishwakSen Vs SKN : సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు టైటిల్స్ గురించి వివాదాలు వస్తూనే ఉంటాయి. కొంతమంది రిజిస్టర్ చేయించుకొని అనౌన్స్ చేస్తారు. కొంతమంది రిజిస్టర్ చేయించకుండానే అనౌన్స్ చేస్తారు. అనుకోకుండా రెండు సినిమా టైటిల్స్ ఒకేలా ఉన్నా ఆ మూవీ యూనిట్స్ మధ్య వివాదం వస్తుంది. గతంలో కూడా పలు సినిమాల మధ్య టైటిల్స్ వివాదాలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు ఓ టైటిల్ సినీ పరిశ్రమలో వైరల్ అవుతుంది.

కొన్ని రోజుల క్రితం బేబీ సినిమా నిర్మాత SKN ‘కల్ట్ బొమ్మ’ అనే టైటిల్ ప్రకటించాడు. ఆ సినిమాపై వర్క్ జరుగుతుందని, త్వరలోనే ఈ సినిమాని ప్రకటిస్తామని తెలిపారు. దీంతో ఈ టైటిల్ పై ఆసక్తి పెరిగింది. అయితే నేడు విశ్వక్ సేన్ నిర్మాతగా ‘#కల్ట్'(Cult) అనే సినిమాని ప్రకటించాడు. ఈ సినిమాని ప్రకటిస్తూ ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టాడు.

ఈ ప్రెస్ మీట్ లో ఓ మీడియా ప్రతినిది ఆల్రెడీ SKN కల్ట్ బొమ్మ(Cult Bomma) అనౌన్స్ చేశారు, మీరు కల్ట్ అని టైటిల్ ప్రకటించారు అని అడగ్గా.. విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. దాని గురించి నాకు తెలీదు. నేనైతే #కల్ట్ ని రిజిస్టర్ చేయించాను. రిజిస్టర్ చేయించేటప్పుడు కూడా అడిగాను. ఆలాంటి టైటిల్ నేను వినలేదు. ఈ టైటిల్ అయితే నాదే అని అన్నారు. దీంతో మీడియా అంతా నిర్మాత SKN ని ఈ టైటిల్ గురించి అడగ్గా దీనిపై ట్వీట్ తో క్లారిటీ ఇచ్చాడు SKN.

Also Read : VishwakSen : విశ్వక్‌సేన్ సినిమాలో నటిస్తారా? అయితే ఈ ఛాన్స్ మీ కోసమే.. ‘కల్ట్’ కోసం విశ్వక్ వేట..

బేబీ నిర్మాత SKN తన ట్వీట్ లో.. కొంతమంది మీడియా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. కల్ట్ బొమ్మ టైటిల్ రిజిస్టర్ చేయించకుండా అనౌన్స్ చేశారా అని. అందరి ప్రశ్నలకు నేను క్లారిటీ ఇస్తున్నాను. కల్ట్ బొమ్మ అనే టైటిల్ బేబీ సినిమా ప్రమోషన్స్ నుంచే పాపులర్ అయింది. నేను ఆల్రెడీ నా నెక్స్ట్ సినిమా కోసం ఆ టైటిల్ ని కొన్ని నెలల క్రితమే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేయించాను. ఒక బాధ్యతగల నిర్మాతగా, మెంబర్ గా నేను టైటిల్ రిజిస్టర్ చేయించకుండా ప్రకటింను అని క్లారిటీ ఇచ్చారు.

దీంతో ప్రస్తుతానికి అయితే ఈ రెండు టైటిల్స్ వేరని తెలుస్తుంది. మరి భవిష్యత్తులో ఇద్దరూ ఇదే టైటిల్స్ తో వస్తారా? లేదా టైటిల్స్ మారుస్తారా చూడాలి.