VishwakSen : విశ్వక్‌సేన్ సినిమాలో నటిస్తారా? అయితే ఈ ఛాన్స్ మీ కోసమే.. ‘కల్ట్’ కోసం విశ్వక్ వేట..

తాజాగా నేడు తన వన్మయి క్రియేషన్స్, VS సినిమాస్ నిర్మాణంలో ఓ సినిమాని ప్రకటించాడు విశ్వక్‌సేన్.

VishwakSen : విశ్వక్‌సేన్ సినిమాలో నటిస్తారా? అయితే ఈ ఛాన్స్ మీ కోసమే.. ‘కల్ట్’ కోసం విశ్వక్ వేట..

Do You Wanna act in Vishwaksen Movie Here Full Details Must Know about it

Updated On : December 30, 2023 / 7:54 PM IST

VishwakSen : హీరో విశ్వక్‌సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మార్చ్ లో దాస్ కా ధమ్కీ సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు విశ్వక్‌సేన్. ఈ సినిమాకి దర్శకత్వం, నిర్మాత కూడా తనే కావడం విశేషం. ప్రస్తుతం విశ్వక్ చేతిలో ఓ మూడు సినిమాలు ఉన్నాయి. మరో వైపు నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తున్నాడు. త్వరలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో రాబోతున్నాడు విశ్వక్‌సేన్.

తాజాగా నేడు తన వన్మయి క్రియేషన్స్, VS సినిమాస్ నిర్మాణంలో ఓ సినిమాని ప్రకటించాడు విశ్వక్‌సేన్. ‘#కల్ట్’ అనే టైటిల్ తో సినిమాని అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు తనే కథ అందించగా దర్శకత్వం తాజుద్దీన్ అనే కొత్త దర్శకుడు చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో విశ్వక్ నటించట్లేదు. కొత్తవాళ్లతో ఈ సినిమాని తీయబోతున్నాడు విశ్వక్. ఈ కల్ట్ టైటిల్ కి – Like A Leap Year 2024 అనే సబ్ టైటిల్ కూడా ఇచ్చారు. ఇక పోస్టర్ మీద Say No To Drugs అని రాయడంతో ఇది యూత్, డ్రగ్స్ చుట్టూ తిరిగే కథ అని తెలుస్తుంది.

Also Read : సీఎం అవ్వాలి అనుకుంటే పెద్ద కష్టమేమి కాదు.. కానీ.. మెగా ఫ్యామిలీపై శివాజీ సంచలన వ్యాఖ్యలు..

అయితే ఈ సినిమాలో నటించడానికి కొత్తవాళ్లు కావాలని ప్రకటన ఇచ్చాడు విశ్వక్. ఈ ప్రకటనలో.. ముగ్గురు బాగా నవ్వించే అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు 20 ఏళ్ళు పైబడిన వాళ్ళు కావాలి. మీ ఒక నిమిషం ఆడిషన్ వీడియోలు మాకు పంపండి. నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసి ఆడిషన్స్ కి పిలుస్తాం. మీలోంచే హీరో, హీరోయిన్స్ ని సెలెక్ట్ చేస్తాం. అయితే ఇన్ స్టాగ్రామ్ రీల్స్, టిక్ టాక్ వీడియోలు లాంటివి మాత్రం పంపొద్దు అని చెప్పారు. ఇక ఆడిషన్ వీడియోలను cultthefilmofficial@gmail.com అనే మెయిల్ ఐడికి పంపమన్నారు. ఇంకెందుకు ఆలస్యం విశ్వక్ కల్ట్ సినిమాలో నటిద్దామనుకుంటే మీరు కూడా ట్రై చేసేయండి.