విశ్వ దర్శనం సినిమా టీజర్ రిలీజ్..
తన మేధస్సుతో సినిమా చూసే ప్రేక్షకుడి ఆలోచనా విధానాన్ని మార్చి, తన సినిమాలతో సమాజంలో మార్పుకి శ్రీకారం చుట్టి, తన సినిమాలకు ప్రేక్షకలు భక్తి భావంతో వచ్చేలా చేసి, తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి జన్మదినం ఈ రోజు. ఈ సందర్భంగా, రచయిత, దర్శకుడు జనార్దన మహర్షి, విశ్వనాథ్ గారి సినీ ప్రయాణం ఆధారంగా చేస్తున్న విశ్వ దర్శనం సినిమా టీజర్ రిలీజ్ చేసారు. వందేళ్ళ వెండితెర చెబుతున్న తొంభై ఏళ్ళ బంగారు దర్శకుడి కథ.. అనే వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ టీజర్‌లో, పి.సుశీల, రాధిక, భానుప్రియ, ఆమని, శైలజ, తనికెళ్ళ భరణి, విజయేంద్ర ప్రసాద్, పట్టాభిరామ్ తదితరులు విశ్వనాథ్ గారి పనితీరు గురించి, ఆయన సినిమా తీసే విధానం గురించి చెప్తున్న బైట్స్‌ని వెండితెరపై చూపిస్తూ, విశ్వనాథుడి వల్ల వెండితెరకి, వెండితెర వల్ల విశ్వనాథుడికి గౌరవం పెరిగింది.. అని చాలా బాగా చెప్పారు.
చివరిలో విశ్వనాథ్ గారు.. నేను సినిమా అనేటువంటి ఒక బస్సు పట్టుకుని, సినిమా చూసే ప్రేక్షకులనే వాళ్ళు భక్తులనుకుని, నేనొక బస్సు నడిపే డ్రైవర్‌ని… అని చెప్పడం అద్భుతం… ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై, టి జి విశ్వప్రసాద్ నిర్మించాడు.. సహనిర్మాత : వివేక్ కూఛిబొట్ల. త్వరలో సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నారు.
వాచ్ విశ్వదర్శనం టీజర్…