×
Ad

Bhagath Singh Nagar: భగత్‌సింగ్ నగర్ నుంచి శ్రీకాంత్ చేతుల మీదుగా సాంగ్

గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకంపై విదార్థ్, ధృవిక హీరోహీరోయిన్లుగా వాలజా క్రాంతి దర్శకత్వంలో వాలజా గౌరి, రమేష్ ఉడత్తు నిర్మిస్తున్న చిత్రం 'భగత్ సింగ్ నగర్'.

  • Published On : November 12, 2021 / 01:22 PM IST

Vishwa

Bhagath Singh Nagar: గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకంపై విదార్థ్, ధృవిక హీరోహీరోయిన్లుగా వాలజా క్రాంతి దర్శకత్వంలో వాలజా గౌరి, రమేష్ ఉడత్తు నిర్మిస్తున్న చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది.

ఈ సినిమా నుంచి ‘ఈ విశ్వమంత వ్యాపించిన’ పాటను హీరో శ్రీకాంత్, బెనర్జీ చేతుల మీదుగా విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులోని చరిత చూపని అనే పాటను ప్రకాష్ రాజ్ విడుదల చేయగా.. ఆ సాంగ్ సూపర్‍‌ హిట్ అవ్వగా.. ఇప్పుడు ‘విశ్వమంతమూ వ్యాపించిన’ అంటూ సాగే పాటను శ్రీకాంత్ విడుదల చేశారు.

ఈ సంధర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. భగత్‌సింగ్ నగర్ పేరులోనే పవర్ ఉందని, చరిత చూపని సాంగ్‌లో ఆ పవర్ స్పష్టంగా కనిపిస్తుందని, అదే రేంజ్‌లో ఈ విశ్వంతము వ్యాపించిన సాంగ్ ఉందన్నారు. పాట ప్రస్తుత పరిస్థితులకి అద్దం పెట్టినట్టుగా ఉందంటూ.. భగత్‌సింగ్ నగర్ టీమ్‌ని ప్రశంసించారు.

ఒక కొత్త టీమ్ కొత్త కథతో సినిమాలు తీయడం.. వారి మంచి ప్రయత్నాని ప్రోత్సహించడం మన బాధ్యతగా భావించి ఆశీర్వదిస్తే ఇంకా మంచి మంచి సినిమాలు మనకి వస్తాయని అన్నారు శ్రీకాంత్.

ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర చేసిన బెనర్జీ మాట్లాడుతూ.. సినిమా లో నేను నెగటివ్ షేడ్స్ ఉన్న మంచి క్యారెక్టర్ చేశాను. సినిమాకు కథే బలం.. ఆ కథను దర్శకుడు క్రాంతి వాలాజా చాలా బాగా తెరకెక్కించాడని చెప్పారు.

ఈ సినిమాలో విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్ తదితరులు నటించారు.