Vivek Agnihotri : మొన్న కశ్మీర్ ఫైల్స్.. రేపు ఢిల్లీ ఫైల్స్..
నిజమైన కథలని ఎంచుకొని, వాటిని పకడ్బందీగా తెరకెక్కిస్తారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ ఫైల్స్ తో మరో విజయాన్ని సాధించారు. తాజాగా తన నెక్స్ట్ సినిమాని.....
- Saketh U
- Published On : April 15, 2022 / 09:17 PM IST
Vivek Agnihotri
Vivek Agnihotri : ఇటీవల 1990లో కశ్మీర్ పండిట్‌లపై జారిగిన మారణహోమం ఆధారంగా తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాని ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీలు, మంత్రులు, ప్రధానమంత్రితో సహా అందరు అభినందించారు. కేవలం మౌత్ టాక్ తోనే ఈ సినిమా 200 కోట్లకు పైగా కలెక్షన్లని రాబట్టింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి తాజాగా తన నెక్స్ట్ సినిమాని ప్రకటించారు.
సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని, నిజమైన కథలని ఎంచుకొని, వాటిని పకడ్బందీగా తెరకెక్కిస్తారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. గతంలో ఆయన తీసిన సినిమాలు మంచి విజయాల్ని సాధించాయి. కశ్మీర్ ఫైల్స్ సినిమాకి ముందు ఆయన తెరకెక్కించిన ‘ది తాష్కెంట్ ఫైల్స్’ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. లాల్ బహదూర్ శాస్త్రి డెత్ మిస్టరీ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ తో మరో విజయాన్ని సాధించారు. తాజాగా తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేశారు.
Pawan Kalyan : సుమక్క సినిమా కోసం రంగంలోకి పవర్ స్టార్..
తన నెక్స్ట్ సినిమాగా ‘ది ఢిల్లీ ఫైల్స్’ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ ఢిల్లీ ఫైల్స్ లో ఎలాంటి నిజాల్ని చూపించనున్నారో అని దేశం మొత్తం ఎదురు చూస్తుంది. మరోసారి కనపడకుండా చేసిన నిజాలని బయటకి తీయడానికి సిద్దమయ్యాడు వివేక్. ఈ సినిమాని కూడా కశ్మీర్ ఫైల్స్ సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలు పెట్టనున్నారు.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 15, 2022
