Vivek Oberoi-Prabhas: ప్రభాస్ డెడికేషన్‌కు బాలీవుడ్ ఫిదా.. వివేక్ ఒబెరాయ్ క్రేజీ కామెంట్స్
ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్(Vivek Oberoi).
- V Santhosh Kumar
- Updated on- May 22, 2026 / 03:58 PM IST
Vivek Oberoi Comments on Prabhas work Dedication
- ప్రభాస్ డెడికేషన్‌కు వివేక్ ఫిదా.
- సెట్స్‌లో ప్రభాస్ ఎంతో సింపుల్.
- ప్రభాస్ హోస్పిటాలిటీ సూపర్ అంటూ ప్రశంసలు.
Vivek Oberoi: పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో పవర్‌ఫుల్ పోలీస్ డ్రామా ‘స్పిరిట్’, అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘ఫౌజీ’ చిత్రాల షూటింగ్‌లతో ఆయన ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి భిన్నమైన కథాంశాలు కావడంతో, ప్రభాస్ తన లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటూ లొకేషన్ల మధ్య డేట్స్‌ను పక్కాగా మేనేజ్ చేస్తున్నారు.
*Gaayapadda Simham OTT: ట్రంప్‌పై పగ తీర్చుకునే ప్రేమికుడి కథ.. ఓటీటీకి వచ్చేసిన ‘గాయపడ్డ సింహం’
ఈ నేపథ్యంలో ‘స్పిరిట్’ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్(Vivek Oberoi) తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. “తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా ప్రభాస్ ఎంతో పట్టుదలతో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అంత పెద్ద గ్లోబల్ స్టార్ అయినప్పటికీ ఆయనకు ఏమాత్రం గర్వం లేదు, స్టార్డమ్ చూపించరు. సెట్స్‌లో అందరితో ఎంతో సింపుల్‌గా కలిసిపోతారు. మౌనంగా తన పని తాను చేసుకుపోయే ఆయన తత్వం నాకు బాగా నచ్చింది” అని వివేక్ పేర్కొన్నారు.
అంతేకాకుండా, ప్రభాస్ ఆతిథ్యం గురించి వివేక్ ఒబెరాయ్ ప్రత్యేకంగా ముచ్చటించారు. “షూటింగ్ లొకేషన్‌కు ప్రభాస్ తీసుకువచ్చే రుచికరమైన వంటల గురించి మాటల్లో చెప్పలేం. ఆయన లంచ్ బాక్స్ కోసం సెట్స్‌లో అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తారు. ప్రభాస్ నిజంగా ఎంతో మందికి స్ఫూర్తి” అంటూ డార్లింగ్ హోస్పిటాలిటీకి ఫిదా అయిపోయారు. ప్రస్తుతం వివేక్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
