Gaayapadda Simham OTT: ట్రంప్‌పై పగ తీర్చుకునే ప్రేమికుడి కథ.. ఓటీటీకి వచ్చేసిన ‘గాయపడ్డ సింహం’
తరుణ్ భాస్కర్ హీరోగా వచ్చిన 'గాయపడ్డ సింహం(Gaayapadda Simham OTT)' మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
Tharun Bhascker Gayapadina Simham movie streaming on Amazon Prime
- ఓటీటీలోకి వచ్చిన గాయపడ్డ సింహం.
- అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ షురూ.
- తరుణ్ భాస్కర్ క్రేజీ స్టోరీ.
Gaayapadda Simham OTT: క్రేజీ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా యాక్షన్ డ్రామా ‘గాయపడ్డ సింహం(Gaayapadda Simham OTT)’. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను కశ్యప్ శ్రీనివాస్ వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కించారు. మే ప్రారంభంలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ వేదికగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. దరహాస్ (తరుణ్ భాస్కర్), షాలిని (ఫరియా అబ్దుల్లా) గాఢంగా ప్రేమించుకుంటారు. అయితే, షాలిని తండ్రి మాత్రం తన కూతురిని అమెరికా సంబంధానికే ఇచ్చి పెళ్లి చేయాలని కండిషన్ పెడతాడు. దీంతో ఎలాగైనా అమెరికా వెళ్లాలని దరహాస్ గట్టిగా డిసైడ్ అవుతాడు. కానీ, అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న కొన్ని కఠిన వీసా నిర్ణయాల వల్ల దరహాస్ లైఫ్ ప్లాన్స్ అన్నీ ఒక్కసారిగా రివర్స్ అవుతాయి.
ట్రంప్ వల్లే తన ప్రేమ, జీవితం ముక్కలయ్యాయని భావించిన దరహాస్, ఆయనపై వింతగా పగ పెంచుకుంటాడు. ఆ తర్వాత ట్రంప్‌పై పగ తీర్చుకోవడానికి దరహాస్ ఏం చేశాడు? ఈ క్రేజీ మిషన్‌లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ బ్రూతల్ ధర్మ (జేడీ చక్రవర్తి) మన హీరోకు ఎలా హెల్ప్ చేశాడు? అనే ఆసక్తికరమైన ట్విస్టులతో ఈ సినిమా సాగుతుంది. ఈ వీకెండ్లో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చూడాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్. మరి లేట్ ఎందుకు చూసేయండి.
