Allu Arjun : బన్నీ సినిమాపై యుద్ధం ఎఫెక్ట్.. ఆగిపోయిన షూటింగ్..
అమెరికా - ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ ఈ సినిమాపై కూడా పడింది అని తెలుస్తుంది. (Allu Arjun)
- Saketh U
- Published On : April 1, 2026 / 04:58 PM IST
Image Created using Gemini AI
Allu Arjun : అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో హాలీవుడ్ సాంకేతిక నిపుణుల మధ్య ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొంత భాగం ముంబైలో వేసిన సెట్స్ లో షూటింగ్ పూర్తయింది.
అయితే అమెరికా – ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ ఈ సినిమాపై కూడా పడింది అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ యుద్ధం ఎఫెక్ట్ ఇండియాపై, ఇండియాలోని పలు బిజినెస్ లపై పడింది. గల్ఫ్ దేశాల్లో మన సినిమా రంగంపై కూడా ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు బన్నీ సినిమాపై యుద్ధం ఎఫెక్ట్ పడింది.
Also Read : Dhurandhar : వామ్మో ఏడున్నర గంటల సినిమా.. రిలీజ్ కి రెడీ చేస్తున్న మూవీ టీమ్..
ముంబై షూటింగ్ తర్వాత దుబాయ్ లోని కొని ప్రదేశాల్లో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసారు. అల్లు అర్జున్ బర్త్ డే ఏప్రిల్ 8 తర్వాత దుబాయ్ లో ఈ సినిమా షూటింగ్ అనుకున్నారు. షెడ్యూల్ కూడా చేసుకున్నారు. అయితే అమెరికా – ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాల్లో కూడా జరుగుతుంది. దీంతో గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు ఆగిపోయాయి. అక్కడ చాలా బిజినెస్ లు మూత పడ్డాయి. ఇలాంటి సమయంలో అక్కడ షూటింగ్ అంటే కష్టమే. అందుకే ఈ షెడ్యూల్ ని క్యాన్సిల్ చేస్తున్నట్టు సమాచారం.
యుద్ధం ఆగేవరకు షూటింగ్ షెడ్యూల్ ఆపుతారా లేక లొకేషన్ మార్చుకుంటారా చూడాలి. మొత్తానికి యుద్ధం ఎఫెక్ట్ మన సినిమాల మీద కూడా పడింది.
Also Read : Vijay Deverakonda : పెళ్లి తర్వాత మొదటిసారి.. రష్మికతో కలిసి విజయ్.. ఫ్రెండ్ పెళ్ళిలో సందడి..
