హ్యాపీ బర్త్‌డే చై – Welcome to The World of NC 19

హ్యాపీ బర్త్‌డే యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య.. ‘వెల్ కమ్ టు ది వరల్డ్ ఆఫ్ NC 19’ గ్లింప్స్ రిలీజ్..

  • Publish Date - November 23, 2019 / 05:34 AM IST

హ్యాపీ బర్త్‌డే యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య.. ‘వెల్ కమ్ టు ది వరల్డ్ ఆఫ్ NC 19’ గ్లింప్స్ రిలీజ్..

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య పుట్టినరోజు (నవంబర్ 23).. ఈసారి తన బర్త్ డే నాడు రెండు సినిమాల అప్ డేట్స్‌తో అక్కినేని అభిమానులను సర్ ప్రైజ్ చేస్తున్నాడు.. ‘వెంకీమామ’, ‘NC 19’ సినిమాల విశేషాలు శనివారం తెలియనున్నాయి.

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా నుండి హీరో చైతు లుక్ విడుదల చేసిన టీమ్.. తాజాగా చైతుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘వెల్ కమ్ టు ది వరల్డ్ ఆఫ్ NC 19’ పేరుతో గ్లింప్స్ రిలీజ్ చేసింది.

Read Also : అర్జున్ రెడ్డి.. అరవంలోనూ అదిరిందిగా!

చైతు మేకోవర్ ఆకట్టుకుంటుంది. ‘మజిలీ’ తర్వాత మరోసారి తన నటనతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ను అలరించనున్నాడని అర్ధమవుతోంది. చైతు హీరోగా నటిస్తున్న 19వ సినిమా ఇది.  విజయ్ సి కుమార్ విజువల్స్, పవన్ ఆర్ఆర్ బాగున్నాయి. నేచురల్ క్యారెక్టర్స్‌తో బ్యూటిఫుల్ కథలను తెరపై ఆవిష్కరించే శేఖర్ కమ్ముల ఈ ప్రేమ కథను మరింత హృద్యంగా తెరకెక్కిస్తున్నారు. 

సోనాలి నారంగ్ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, ఏమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.