రజనీ ‘రోబో’ సీన్ స్ఫూర్తితోనే Age of Ultron క్లైమాక్స్ తీశాం : ఎవెంజర్స్ డైరెక్టర్ జోన్ రసో

  • Published By: sreehari ,Published On : April 12, 2020 / 10:18 AM IST
రజనీ ‘రోబో’ సీన్ స్ఫూర్తితోనే Age of Ultron క్లైమాక్స్ తీశాం : ఎవెంజర్స్ డైరెక్టర్ జోన్ రసో

Updated On : April 12, 2020 / 10:18 AM IST

2019 లో ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ కోసం ఇండియాకు వచ్చిన దర్శకుడు  Joe Russo సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో మూవీలోని ఒక సీన్ Avengers: Age of Ultron క్లైమాక్స్‌ను దాదాపుగా ప్రేరేపించిందని చెప్పారు. రెండవ ఎవెంజర్స్ మూవీ మొదటి మాదిరిగానే Joss Whedon దర్శకత్వం వహించారు. జో, అతని సోదరుడు ఆంథోనీ ఎవెంజర్స్: Infinity War and Endgame దర్శకత్వం వహించారు.  

ముంబైలో Joe Russo విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఎవెంజర్స్: Age of Ultronలోని క్లైమాక్స్ సీన్లను రోబోట్ దాదాపుగా ప్రభావితం చేసింది. రోబోట్‌లో మీకు తెలుసా.. రోబోలన్నీ కలిసి వచ్చి పెద్దపాము మాదిరిగా మారిపోవడం చూశాం. Ultronలోని అన్ని Ultron కలిసి ఒక పెద్ద Ultron మారిపోతాయి. ఎవెంజర్స్ దానితో పోరాడాల్సి ఉంటుంది. రోబోలోని సన్నివేశం నేరుగా మా మూవీ క్లైమాక్స్ సీన్‌తో ప్రేరణ పొందేలా చేసింది’ అని చెప్పారు.

సల్మాన్ ఖాన్ దబాంగ్ మూవీలో కూడా యాక్షన్ సీన్ మెచ్చుకున్నానని Russo చెప్పాడు. ‘నేను యాక్షన్ డైరెక్టర్.. సంవత్సరాల క్రితం దబాంగ్‌ను చూశాను. నేను ఇంకా దబాంగ్ 2ని చూడాలి. ఆ చిత్రాలలో కెమెరా పనితనం చాలా గొప్పదని నేను భావించాను. వాయిస్, ఎనర్జీ చాలా బాగుందని చెప్పారు. 

ఎవెంజర్స్ డైరెక్టర్  Russo రాబోయే అమెజాన్ ప్రైమ్ సిరీస్‌లో ప్రియాంక చోప్రాతో కలిసి పని చేస్తున్నారు. ఎండ్‌గేమ్‌ను ఆల్-టైమ్ బాక్స్ ఆఫీస్ వసూళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత సోదరులు నెట్‌ఫ్లిక్స్ ఎక్స్‌ట్రాక్షన్‌ను నిర్మిస్తారు.

ఇందులో Thor స్వయంగా Chris Hemsworth నటించారు. ఈ చిత్రానికి కథను Jeo రాశారు. భారతదేశంలోనే ఈ మూవీని ఎక్కువగా చిత్రీకరించారు. దర్శకులుగా సోదరుల తదుపరి చిత్రం చెర్రీ, దీనిలో వారు మరో ఎవెంజర్స్ స్టార్ Tom Hollandతో కలిసి మళ్లీ నటించనున్నారు.