బాలీవుడ్‌లో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రాజకీయాల కారణంగా నటీనటుల మధ్య తీవ్ర వాగ్వాదం నడుస్తుంది. కంగానాతో మొదలైన గొడవ జయ బచ్చన్ రాజ్యసభలో బీజేపీ ఎంపీ రవి కిషన్‌తో తలపడగా.. లేటెస్ట్‌గా కంగనా రనౌత్ కావాలనే తనేదో బాధితురాలు అన్నట్లు డ్రామాలాడుతుందని కాంగ్రెస్ నాయకురాలు, రంగీలా ఫేమ్ ఊర్మిళ మటోండ్కర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముంబైపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కంగనా.. తన స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్ మాదకద్రవ్యాలకు మూలం అన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు. బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియా అంటూ ఆరోపిస్తున్న కంగనా.. తన పోరాటాన్ని సొంత రాష్ట్రం నుంచి ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
పెద్దగా నోరేసుకొని, గట్టిగా మాట్లాడినంత మాత్రాన కంగనా మాట్లాడేవి నిజాలు అయిపోవని ఆమె అన్నారు. ప్రజల ట్యాక్స్‌తో వై-ప్లస్ క్యాటగిరీ సెక్యురిటీ అందుకున్న కంగనా.. డ్రగ్స్ గురించి తెలిసిన వెంటనే పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు.
https://10tv.in/ms-subbulakshmi-birthday-special-story/
ముంబైని వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదంటూ ఊర్మిళ హెచ్చరించారు. కంగన వ్యాఖ్యలు ప్రజలను అవమానించేలా ఉన్నాయని, ఉమెన్ కార్డు ఉపయోగించి ఏమైనా మాట్లాడేస్తే చెల్లదని, తప్పు ఎవరు చేసినా తప్పే అని ఊర్మిళ అన్నారు. పబ్లిసిటీ కోసం.. స్వార్థ ప్రయోజనాల కోసం ముంబైని కించపరిచేలా మాట్లాడడం సరికాదని వ్యాఖ్యలు చేశారు.