హిందీలో అల వైకుంఠపురం..హీరో ఎవరు ?

  • Published On : June 5, 2020 / 07:56 AM IST

టాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యిన సినిమా. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆల్రెడీ రీమేక్ రైట్స్ కూడా కొనేసుకున్నారు. ఈ తెలుగు సినిమా రీమేక్ లో నటించడానికి సల్మాన్ ఖాన్, రణవీర్ తో సహా..బాలీవుడ్ హీరోలు తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అల వైకుంఠపురం సినిమా రిలీజ్ అయ్యి 5 నెలలవుతున్నా..ఇంకా ఆ సినిమాకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

సినిమా సక్సెస్ అయినప్పటినుంచి బాలీవుడ్ లో రీమేక్ గురించి టాక్ నడుస్తూనే ఉంది. బాలీవుడ్ లో కూడా నేనంటే నేను అంటూ హీరోలు క్యూలో ఉన్నారు. అల వైకుంఠపురం సినిమా ఇంత ఇంట్రస్టింగ్ గా ఉంది కాబట్టే ..అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకుని అంత పెద్ద సక్సెస్ అయ్యింది. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమా సక్సెస్ బాలీవుడ్ వరకూ వెళ్లింది. 

రికార్డులు తిరగరాసిన ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చెయ్యడానికి హీరోలందరూ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత అశ్విన్ ..అల వైకుంఠపురం రీమేక్ రైట్స్ భారీ రేట్ కి దక్కించుకున్నారు. అశ్విన్ రీమేక్ రైట్స్ కొన్న దగ్గర నుంచి ఈ సినిమాలో నటించే హీరోల మీద రోజుకో న్యూస్ బయటికొస్తోంది. అల వైకుంఠపురం సినిమాని  రణవీర్ సింగ్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడన్న టాక్ నడుస్తోంది. బాలీవుడ్ లో ఇలాంటి ఫ్యామలీ డ్రామాకి యాక్షన్ యాడ్ చేసి భారీగా సినిమాని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట. 

రణవీర్ కన్నా ముందు సల్మాన్ ఖాన్ పేరు కూడా వినిపించింది. నిజానికి సల్మాన్ ఖాన్ ..యాక్షన్ మూవీసే కాకుండా భజరంగీ భాయ్ జాన్, సుల్తాన్ లాంటి ఎమోషనల్ ఎంటర్ టైననర్స్ కూడా చేశారు కాబట్టి.. సల్మాన్ చేస్తే..ఈ సినిమాకు ఇంకా మైలేజ్ వస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు. సల్మాన్, రణవీర్ తో పాటు .. అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ కూడా ఈ సినిమాపై ఇంట్రస్ట్ చూపిస్తున్నారట.

ఈ సీనియర్ హీరోలతో పాటు .. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా అల వైకుంఠపురం సినిమా చెయ్యడానికి రెడీగా ఉన్నానని చెబుతున్నాడు. మరి ఇంతమంది ఇంట్రస్ట్ చూపిస్తున్న అల వైకుంఠపురం లోకి ఎంటరయ్యే బాలీవుడ్ హీరో ఎవరా అని తెగ ఆలోచిస్తున్నరు అటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ జనాలు.

Read: ఫోర్భ్స్ టాప్ 10 సెలబ్రిటీలు వీరే.. అక్షయ్ కుమార్ సంపాదన ఎంతంటే?