Trisha Krishnan : త్రిష టార్గెట్‌గా వరుస వివాదాలు.. ఇదంతా పొలిటికల్ గేమా?

త్రిష వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అసలు ఆమెని ఎవరు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు త్రిషపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు?

Trisha Krishnan

Trisha Krishnan : ఆ మధ్య నటుడు మన్సూర్ అలీఖాన్.. రీసెంట్‌గా అన్నాడీఎంకే లీడర్ ఏవీ రాజు త్రిషని టార్గెట్ చేశారు. అసలు త్రిషనే ఎందుకు బయటకు లాగుతున్నారు? ఆమెపైనే ఎందుకు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు? ఇదంతా రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకంగా జనం మాట్లాడుకుంటున్నారు.

Saripodhaa Sanivaaram : ‘సరిపోదా శనివారం’ గ్లింప్స్ రిలీజ్.. కోపాన్ని వారంలో ఒక్కరోజే చూపించే పిచ్చోడు..

త్రిషపై రోజుకో వివాదం పుట్టుకొస్తోంది. ఆ మధ్య త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పరువు పోగొట్టుకున్నారు. లియో సినిమాలో త్రిషతో రేప్ సీన్ లేనందుకు బాధ పడ్డానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అనేకమంది సెలబ్రిటీలు మన్సూర్ అలీఖాన్‌పై మండిపడ్డారు. అతడిని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. త్రిష చట్టపరంగా వెళ్లడం అనేక పరిణామాల మధ్య మన్సూర్ అలీఖాన్ త్రిషకు క్షమాపణలు చెప్పడంతో ఆ స్టోరీ సద్దుమణిగింది.

రీసెంట్‌గా అన్నాడీఎంకే లీడర్ ఏవీ రాజు ప్రముఖ పొలిటికల్ లీడర్ త్రిషకు డబ్బులిచ్చి రిసార్ట్‌కి రప్పించుకున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హీరో విశాలతో పాటు పలువురు అతని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిష ఆ లీడర్‌కి లాయర్ నోటీసులు పంపారు. దీనిపై అతను సమాధానం చెప్పాల్సి ఉంది. ఇటీవల త్రిష రెమ్యునరేషన్‌పై కూడా చర్చలు మొదలుపెట్టారు. సినిమాకు రూ.6 కోట్లు తీసుకుంటున్నారని ఆ డబ్బంతా విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అసలు ఇదంతా గమనిస్తుంటే కావాలని కొందరు త్రిషని టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తోంది.

Kangana Ranaut : ‘క్వీన్’ సీక్వెల్ కథ రెడీ.. పట్టాలెక్కేదెప్పుడంటే..?

అయితే త్రిషను ఇబ్బంది పెట్టడం వెనుక ఒక రాజకీయ పార్టీ హస్తం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తరపున ప్రచారం చేయమని అడిగితే అందుకు త్రిష నో చెప్పారని ఆమెను దారికి తెచ్చుకునేందుకు ఆ పార్టీ ఇలాంటి పనులు చేయిస్తోందని అంటున్నారు. త్రిషకున్న పాపులారిటీ ప్రకారం ఆమె ప్రచారం చేస్తే ఆ పార్టీకి మంచి మైలేజీ వస్తుందని ఆ పార్టీ భావించిందట. కానీ త్రిష వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో గరం మీద ఉన్న ఆ పార్టీ నేతలు త్రిషను వివాదాల్లోకి లాగుతున్నారని తెలుస్తోంది. అసలు ఇదంతా చేస్తున్న రాజకీయ పార్టీ ఏంటో? .. ఆ పార్టీని ఎదుర్కొనేందుకు త్రిష ఎలాంటి అడుగులు వేస్తారో వేచి చూడాలి.

ట్రెండింగ్ వార్తలు