Guppedantha Manasu Serial
Guppedantha Manasu Serial : ఆసుపత్రిలో ఉన్న జగతి పరిస్థితి ఆందోళనకరంగానే ఉంటుంది. రిషి తనపై కుట్రలు చేస్తోంది ఎవరో చెప్పమని వసుధరని అడుగుతాడు. ‘గుప్పెడు మనసు సీరియల్’ లో ఏం జరిగింది?
ప్రాణాపాయస్థితిలో ఉన్న జగతిని తల్చుకుని భర్త మహేద్ర కన్నీరు పెట్టుకుంటాడు. జగతి లేకుండా తను బ్రతకలేనని రిషి, వసుధరతో చెబుతాడు. తల్లిగా రిషి కోసం జగతి ఎంతగా తపించిందో రిషికి వివరిస్తాడు. వసుధరని, రిషిని కలపడం కోసం తనెంత తపన పడిందో చెప్తాడు. తండ్రి బాధను చూసి రిషి తట్టుకోలేకపోతాడు. రిషి, వసుధర మహేంద్రను ఓదార్చే ప్రయత్నం చేస్తారు.
డాక్టర్ జగతి ఆరోగ్య పరిస్థితి 36 గంటలు దాటితే కానీ చెప్పలేమని చెబుతాడు. బుల్లెట్ గుండె పక్కన ఉండటంతో ఆపరేషన్ చేయడం కష్టమైందని వివరిస్తాడు. జగతి పరిస్థితి తెలిసి అందరూ ఆందోళన పడతారు. ఎప్పుడూ మేడం .. మేడం అంటూ జగతిని పిలిచే రిషి వసుధరతో మాట్లాడుతూ జగతిని మొదటిసారి అమ్మ అని సంబోధిస్తాడు. అతని సంబోధనకి వసుధర ఎమోషనల్ అవుతుంది. అసలు తన చుట్టూ ఏం జరుగుతోందని? తనపై కుట్రలు చేసేవారు ఎవరని? తనకు నిజాలు చెప్పమని వసుధరను నిలదీస్తాడు రిషి. ఈలోపు మహేంద్ర కుటుంబం జగతిని చూడటానికి ఆసుపత్రికి వస్తుంది.
జగతికి ఈ పరిస్థితి తీసుకువచ్చిన శైలేంద్ర ఏం ఎరగనట్లు మాట్లాడతాడు. ఒంటరిగా ఉన్న వసుధర దగ్గరకు వచ్చి తన జోలికి రావద్దని తను పగపడితే ఎంతదూరమైన వెళ్తానని వార్నింగ్ ఇస్తాడు. వసుధర రిషికి అసలు నిజాలు చెప్పేస్తుందా? నెక్ట్స్ ఎపిసోడ్‌లో తెలియాలి. ‘గుప్పెడంత మనసు’ సీరియల్ రోజు రోజుకు ఉత్కంఠగా సాగుతోంది. ఈ సీరియల్‌లో ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.