Allu Arjun: గ్లోబల్ హిట్ గ్యారంటీ.. అల్లు అర్జున్ ఫుల్ హ్యాపీ.. అంచనాలు పెంచుతున్న రత్న కుమార్ కామెంట్స్
అల్లు అర్జున్(Allu Arjun), లోకేష్ కనగరాజ్ సినిమాపై అంచనాలు పెంచుతున్న రైటర్ రత్నకుమార్ కామెంట్స్.
- V Santhosh Kumar
- Published on- April 23, 2026 / 02:17 PM IST
Writer Rathna Kumar interesting comments on Allu Arjun and Lokesh Kanagaraj movie
- ఇది ఆసక్తికరమైన కథ
- అందరి ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది
- రైటర్ రత్నకుమార్ కామెంట్స్ వైరల్
Allu Arjun: పుష్ప 2 బ్లాక్ బస్టర్ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నారు. వరుసగా క్రేజీ సినిమాలను లైనప్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే తమిళ దర్శకుడు అట్లీతో రాకా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో భారీ సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే, అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా గురించి తాజాగా సహ రచయితగా పని చేస్తున్న రత్నకుమార్ పంచుకున్న విషయాలు అంచనాలను పెంచుతున్నాయి.
Shriya Saran: స్టైలిష్ క్వీన్.. బ్లూ అవుట్‌ఫిట్‌లో ట్రెండ్ సెట్ చేస్తున్న శ్రీయ శరన్
రత్నకుమార్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా కేవలం ఒక స్టార్ హీరో లేదా ఒక ప్రాంతానికి సంబంధించిన కథ కాదు. ఇందులో ఉన్న పాయింట్ అంతర్జాతీయ అప్పీల్ కలిగి ఉండటంతో ఇది సరైన పాన్-ఇండియన్ చిత్రంగా నిలవబోతోంది. కథలోని వైవిధ్యం, అది సాగే తీరు అన్ని భాషల ప్రేక్షకులను కట్టిపడేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అల్లు అర్జున్ (Allu Arjun)లాంటి గ్లోబల్ స్టార్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో, దర్శకుడు అనుకున్న విజన్ ప్రకారం సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దడానికి కావాల్సిన అన్ని వనరులు సమకూరుతున్నాయని, దీనివల్ల అవుట్‌పుట్ ఉత్తమంగా ఉంటుందని తెలిపారు.
ఇప్పటికే, ఈ ప్రాజెక్ట్ గురించి అల్లు అర్జున్‌తో జరిపిన చర్చలు చాలా ఉత్సాహంగా సాగాయని, వర్క్ ప్రస్తుతం ‘వెరితనం’గా (చాలా సీరియస్‌గా) కొనసాగుతోందని రత్నకుమార్ పేర్కొన్నారు. మూడు వారాల పాటు కీలక చర్చలు ముగిశాయని, మే రెండో వారం నుంచి పూర్తిస్థాయి పనులు ప్రారంభం కానున్నాయని స్పష్టం చేశారు. దీంతో, అల్లు అర్జున్- లోకేష్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. మరి ఈ సినిమా విడుదల తరువాత ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.
