‘యమదొంగ’ తమిళ్‌లో ‘విజయన్’‌గా విడుదల

దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం.. ‘యమదొంగ’.. త్వరలో తమిళనాట విడుదల కానుంది..

  • Publish Date - October 27, 2019 / 09:00 AM IST

దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం.. ‘యమదొంగ’.. త్వరలో తమిళనాట విడుదల కానుంది..

దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం.. ‘యమదొంగ’.. 2007 ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తారక్ నటన, రాజమౌళి టేకింగ్, కీరవాణి సంగీతం, సెంథిల్ ఫోటోగ్రఫీ సినిమాను వేరే లెవల్‌కి తీసుకెళ్లాయి..

యమధర్మరాజుగా మోహన్ బాబు, ఆయన భార్యగా ఖుష్బూ, నారదుడిగా నరష్ నటించగా మమతా మోహన్‌దాస్ ఇంపార్టెంట్ రోల్ చేసింది. రంభ, ప్రీతిజింగానియా, అర్చన, నవనీత్ కౌర్ స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ‘యమదొంగ’ తమిళ్‌లో రిలీజ్ కానుంది. ఇంతకుముందు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈగ’, ‘బాహుబలి : ది బిగినింగ్’, ‘బాహుబలి : ది కన్‌క్లూజన్’ సినిమాలు తమిళనాట విడుదలయ్యాయి. 

‘విజయన్’/‘ఇవన్ ఎమకాదగన్’ పేరుతో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని, త్వరలో రీలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారని కోలీవుడ్ మీడియా వర్గాలు చెప్తున్నాయి. మ్యూజిక్ : కీరవాణి, కథ : విజయేంద్ర ప్రసాద్, సినిమాటోగ్రఫీ : సెంథిల్ కుమార్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు.