Yash : కేజీఎఫ్ 3 గురించి ప్ర‌శాంత్ నీల్‌తో మాట్లాడుతూనే ఉన్నా.. కానీ.. య‌శ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

కేజీఎఫ్ 3 గురించి (Yash) య‌శ్ ఓ స్ప‌ష్ట‌త ఇచ్చాడు.

Yash intresting comments on KGF 3

Yash : కేజీఎఫ్ సిరీస్ గురించి అభిమానుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 చిత్రాలు భారీ విజ‌యాల‌ను సొంతం చేసుకున్నాయి. హీరో యశ్‌ను గ్లోబ‌ల్ స్టార్ చేశాయి. ఇక కేజీఎఫ్ 3 ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా దీనిపై హీరో య‌శ్ ఓ స్ప‌ష్ట‌త ఇచ్చాడు. కేజీఎఫ్ 3 త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని అన్నాడు. అయితే.. ఇప్ప‌ట్లో మాత్రం ఈ మూవీ రావ‌డం క‌ష్ట‌మేన‌ని చెప్పుకొచ్చాడు. భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉండ‌డం కూడా ఇందుకు ఓ కార‌ణం అని తెలిపాడు.

ఇక ఈ విష‌యంపై ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌తో మాట్లాడుతూనే ఉన్న‌ట్లుగా చెప్పుకొచ్చాడు. స‌రైన స‌మ‌యంలో సినిమా ఖ‌చ్చితంగా వ‌స్తుంద‌ని మాత్రం తెలిపాడు. య‌శ్ వ్యాఖ్య‌ల‌తో కేజీఎఫ్ 3 ఇప్ప‌ట్లో రాద‌ని అర్థ‌మ‌వుతోంది.

Surya Be Positive : ‘సూర్య బి పాజిటివ్’ టీజర్ చూసారా..?

ఇదిలా ఉంటే.. య‌శ్ ప్ర‌స్తుతం ప‌లు భారీ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో టాక్సిక్‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం జూన్ 4న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. నితీశ్ తివారీ తెర‌కెక్కిస్తున్న రామాయ‌ణ చిత్రంలో య‌శ్ రావ‌ణుడి క‌నిపించ‌నున్నాడు.

ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. తొలి భాగం ఈ ఏడాది దీపావ‌ళికి రెండో భాగం వ‌చ్చే ఏడాది దీపావ‌ళికి విడుద‌ల కానున్న‌ట్లు చిత్ర బృందం ఇప్ప‌టికే తెలియ‌జేసింది. మ‌రోవైపు ప్ర‌శాంత్ నీల్.. ఎన్టీఆర్‌తో ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రం 2027 జూన్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.