Surya Be Positive : ‘సూర్య బి పాజిటివ్’ టీజర్ చూసారా..?
సూర్య బి పాజిటివ్ టీజర్ మీరు కూడా చూసేయండి..(Surya Be Positive)
Surya Be Positive
Surya Be Positive : కాళీ క్రాఫ్ట్స్, నిర్మలం డ్రామాస్ బ్యానర్స్ పై సుబ్బా మాధవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సూర్య బి పాజిటివ్. చరణ్ పీసర్ల హీరోగా, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోయిన్స్ గా రోహిత్ సత్యన్, సుజాత దీక్షిత్, చంద్ర గౌతమ్, సత్య, సురభి లలిత, గీతన్ సాయితేజ.. పలువురు కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా దండోరా డైరెక్టర్ మురళికాంత్ దేవసోత్, కిష్కింధపురి డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి గెస్టులుగా హాజరయ్యారు.
సూర్య బి పాజిటివ్ టీజర్ మీరు కూడా చూసేయండి..
Also Read : R Parthiban : మొన్న కులం గురించి మాట్లాడి వార్తల్లో.. ఇవాళ కులం వద్దని వైరల్..
టీజర్ లాంచ్ ఈవెంట్లో నటుడు రోహిత్ సత్యన్ మాట్లాడుతూ.. నేను 2017 నుండి సినిమాల్లో నటిస్తున్నాను. కానీ మొదటిసారి ఈ సినిమా వల్ల స్టేజ్ పై మాట్లాడుతున్నా. నా వయసుకు మించిన క్యారెక్టర్ నాతో దర్శకులు చేయించారు, అది నాకు ఛాలెంజ్ గా అనిపించింది అన్నారు. నటుడు చరణ్ మాట్లాడుతూ.. మా డైరెక్టర్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ సినిమా దర్శకత్వం చేసేటప్పుడు అక్కడ ఉద్యోగాన్ని అలాగే ఇక్కడే సినిమాను పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి చేశారు. మా నిర్మాత ఆయన ఎన్ని సంవత్సరాల కష్టాన్ని మాపై నమ్మకంతో ఈ సినిమాపై పెట్టారు. నేను ఇప్పటికి మూడు సినిమాలలో నటించినా అవి రిలీజ్ అవ్వలేదు. ఇది నాలుగవ సినిమా రిలీజ్ అవుతుంది అని తెలిపాడు.

దండోరా డైరెక్టర్ మురళికాంత్ మాట్లాడుతూ.. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కి గెస్ట్ గా పిలవడానికి వచ్చినప్పుడు వీళ్ళు పడ్డ కష్టం గురించి తెలుసుకున్నాను. నా సినిమా చేసేప్పుడు నేను కష్టాలు పడ్డాను. సినిమాలో అవకాశం వచ్చిన మొదటిసారి ఆ అవకాశం ఒక్కసారే వస్తుంది అని అర్థమైన రోజున సినిమా బాగా చేస్తారు. డైరెక్టర్ అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇక్కడికి వచ్చి సినిమా చేశారు. అలా చేయడం నావల్ల కాలేదు, నేను ఆయనను అభినందిస్తున్నాను అని అన్నారు.
Also See : Aishwarya Rai : పెళ్లి రోజు స్పెషల్.. భర్త, కూతురుతో స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన ఐశ్వర్య రాయ్..
కిష్కిందపురి డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి మాట్లాడుతూ.. టీజర్ కట్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. నేను ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం మురళి గారు నా సీనియర్, చరణ్ నా జూనియర్. మేమంతా ఒకటే కాలేజీ నుండి వచ్చాము. అమెరికా నుండి వచ్చి ఆరు నెలల్లో సినిమా పూర్తి చేసుకుని వెళ్లారు అంటే నమ్మలేకపోతున్నాను అని అన్నారు.
