Yash : 9 ఏళ్ళ క్రితం సారీ చెప్పిన రష్మిక.. ఇప్పుడు స్పందించిన యశ్..
తాజాగా యశ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక చేసిన కామెంట్స్ పై స్పందించాడు. (Yash)
- Saketh U
- Updated on- August 16, 2026 / 03:36 PM IST
Yash
Yash : కన్నడ స్టార్ హీరో యశ్ త్వరలో టాక్సిక్ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్, టీజర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యశ్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా యశ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక చేసిన కామెంట్స్ పై స్పందించాడు.
గతంలో 2017లో రష్మిక కెరీర్ ఆరంభంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యశ్‌ను ఉద్దేశించి ‘మిస్టర్ షో ఆఫ్’ అని కామెంట్ చేసింది. దీంతో అప్పట్లో రష్మిక వ్యాఖ్యలపై యశ్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయడంతో రష్మిక బహిరంగంగానే క్షమాపణలు చెప్పింది. అప్పుడు యశ్ దీనిపై స్పందించలేదు. తాజాగా ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన రావడంతో యశ్ స్పందించాడు.
Also See : Trisha : చీరకట్టులో త్రిష.. ఎంత అందంగా ముస్తాబయిందో..
యశ్ మాట్లాడుతూ.. ఆమె ఏ ఉద్దేశంతో అలా అన్నారో నాకు తెలియదు. అప్పుడే తను ఇండస్ట్రీకి వచ్చింది. కొన్ని ఇంటర్వ్యూలలో యాంకర్లు కొన్ని ఆప్షన్లు ఇచ్చి ఏదో ఒకటి ఎంచుకోమంటారు. ఆ ఆప్షన్లలో నాకు రష్మిక అది ఇచ్చి ఉండొచ్చు. నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎవరి అభిప్రాయం వాళ్లది. అయినా ఒకరి అభిప్రాయం నా వ్యక్తిత్వాన్ని నిర్ణయించలేదు. ఇతరుల దృష్టికోణాన్ని బట్టి నా క్యారెక్టర్ మారదు అని తెలిపారు.
ఇక తన ఫ్యాన్స్ చేసిన ట్రోల్స్ గురించి మాట్లాడుతూ.. నాతోటి నటీనటులను గౌరవించని వారు నా అభిమానులు కారు అని అన్నారు. దీంతో 9 ఏళ్ళ తర్వాత ఆ వివాదంపై యశ్ స్పందించడంతో యశ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Q: Actress #RashmikaMandanna once termed #Yash as "MR SHOW OFF". What do you say?#Yash: I don't know what sense she must've said like that. At that time, she was new to the industry. Everyone has their own opinion. I don’t take everything serious. pic.twitter.com/K7lfWVoVzC
— Movies4u Official (@Movies4u_Officl) August 16, 2026
