Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని విధంగా పూర్తిగా ఊరమాస్ అవతారంలో చూపిస్తుండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Salaar: ‘సలార్’లో ప్రభాస్ డబుల్ సర్ప్రైజ్..?
ఈ సినిమాలో ప్రతి అంశాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రను చాలా పవర్ఫుల్ గా తీర్చిదిద్దుతున్న ప్రశాంత్ నీల్, ఇప్పుడు ఈ సినిమాలో మరో అదిరిపోయే సర్ప్రైజ్ను ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. ఈ సినిమాలో ఓ రాకింగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సలార్ చిత్రంలో ఓ పవర్ఫుల్ కేమియో పాత్రలో రాకింగ్ స్టార్ యశ్‌ను తీసుకుచ్చేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట.
Salaar: డేట్ ఫిక్స్ చేసుకున్న సలార్..?
ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ప్రేక్షకులను థియేటర్లలో ఆపడం ఎవరితరం కాదనే చెప్పాలి. కేజీయఫ్ చిత్రంతో యశ్, బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇండియా లెవెల్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి నిజంగానే సలార్ చిత్రంలో ప్రభాస్ కోసం యశ్ రాకింగ్ సర్ప్రైజ్ ఇస్తాడా లేడా అనేది తెలియాలంటే ఈ సినిమా నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే. ఇక ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోండగా హొంబాలే ఫిలింస్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.