ఒకటి కాదు డార్లింగ్ 4 కోట్లు

కరోనాపై పోరాటానికి రూ. 4 కోట్లు విరాళం ప్రకటించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..

  • Publish Date - March 27, 2020 / 09:19 AM IST

కరోనాపై పోరాటానికి రూ. 4 కోట్లు విరాళం ప్రకటించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..

కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ తీవ్ర భయాందోళనలో మునిగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాధి మరింతగా ప్రబలకుండా ఉండాలని ఎక్కడికక్కడ ప్రజలను ఇంటికే పరిమితం చేసాయి పలు దేశాలు. మన భారత దేశంలో కూడా ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది.

ఈ క్లిష్ట పరిస్థితులలో కరోనాపై పోరాటానికి, ప్రభుత్వాలు పాటిస్తున్న నివారణ చర్యలకు తన వంతు బాధ్యతగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పీఎమ్ రిలీఫ్ ఫండ్‌కి 3 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కి 50 లక్షల రూపాయలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి 50 లక్షల రూపాయలు, మొత్తం కలిపి 4 కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు.

ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సూచన మేరకు సోషల్ డిస్టెన్స్ పాటించాలని, అందరూ సురక్షితంగా తమ ఇళ్ల వద్దనే ఉండాలని ప్రభాస్ ప్రజలను కోరారు ప్రభాస్. ఇటీవలే తన కొత్త సినిమాకు సంబంధించి జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్న డార్లింగ్ ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే.