Young Tiger NTR Landed in America post a pic from California goes viral
NTR : RRR సినిమా ఆస్కార్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ నిలిచింది. ఇక అమెరికాలో మరిన్ని అవార్డుల ఈవెంట్స్ కి RRR యూనిట్ హాజరవుతూ, అక్కడ RRR రీ రిలీజ్ చేయడంతో ఆ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది RRR యూనిట్. ఇప్పటికే రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, సెంథిల్ కుమార్, మరికొంతమంది అమెరికాలో సందడి చేస్తున్నారు.
ఇన్ని రోజులు ఎప్పుడూ RRR యూనిట్ బయటకు వెళ్లినా ఎన్టీఆర్ కూడా వెళ్ళేవాడు కానీ ఈ సారి నందమూరి తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లకుండా ఆగిపోయాడు. తారకరత్న కార్యక్రమాలు అన్ని అయిపోవడంతో సోమవారం ఎన్టీఆర్ అమెరికాకు బయలుదేరాడు. తాజాగా నేడు ఉదయం ఎన్టీఆర్ అమెరికాలో ల్యాండ్ అయినట్టు కాలిఫోర్నియా నుంచి ఓ ఫొటో తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Balagam Movie : బలగం చిత్రయూనిట్ ని అభినందించిన తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్..
వెనుక పులి బొమ్మ ఉన్న టీషర్ట్ వేసుకొని స్టైల్ గా బాల్కనీలో నిల్చొని వెనుక నుంచి తీసిన ఫోటోని ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. బెవర్లీ హిల్స్, కాలిఫోర్నియాలో ఉన్నట్టు తెలిపాడు. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. అమెరికాలో దిగగానే ఎన్టీఆర్ స్టైల్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడని అభిమానులు అంటున్నారు. యంగ్ టైగర్ టైగర్ ఉన్న టీషర్ట్ వేసుకొని అదరగొట్టేశాడని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారం రోజులు ఎన్టీఆర్ RRR యూనిట్ తో కలిసి సందడి చేయనున్నాడు.