YS Jagan : వైఎస్ జగన్ కి సినిమా ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్.. రాజశేఖర్ సినిమాలో.. జగన్ ఏమన్నారంటే..?

ఆ డైరెక్టర్ స్వయంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపాడు. (YS Jagan)

  • Updated on- April 23, 2026 / 02:49 PM IST

YS Jagan Movie Chance - Rajasekhar

YS Jagan : ఈ డైరెక్టర్ ఏకంగా మాజీ సీఎం వైఎస్ జగన్ కే సినిమాలో నటుడిగా ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఇది ఇప్పుడు జరిగింది కాదు. దాదాపు 19 ఏళ్ళ క్రితం జరిగిన సంగతి. ఆ డైరెక్టర్ స్వయంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు వి సముద్ర.

సింహరాశి, శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్.. లాంటి పలు హిట్ సినిమాలు తీసిన సముద్ర హీరో రాజశేఖర్ తో ఎవడైతే నాకేంటి అనే సినిమా తీసాడు. 2007 లో ఓ తమిళ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. పొలిటికల్ యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది.

Also Read : Tamil Nadu Elections 2026 : తమిళనాడు ఎన్నికల్లో ఓటు వేసిన సినీ ప్రముఖులు.. ఫొటో గ్యాలరీ

ఎవడైతే నాకేంటి సినిమాలో రియాలిటీకి దగ్గరగా ఉండాలని డైరెక్టర్ వి సముద్ర పలువురు పొలిటీషియన్స్ ని, పొలిటికల్ ఫ్యామిలీ వాళ్ళను సినిమాలో పెట్టాలనుకున్నాడు. ఈ క్రమంలో ఓ నలుగురు అయిదుగురు పొలిటికల్ లీడర్స్ ని కూడా సినిమాలో చిన్న చిన్న రాజకీయ నాయకుల పాత్రల్లో పెట్టాడు. అలా ఓ పాత్ర కోసం వైఎస్ జగన్ ని కూడా సంప్రదించారట.

సముద్ర దీని గురించి మాట్లాడుతూ.. సినిమాలో సీఎం పాత్ర కోసం వైఎస్ జగన్ ని అనుకున్నాను. అప్పటికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నారు. వైఎస్ జగన్ దగ్గర తెలిసిన వ్యక్తి ఉండటంతో ఆయన్ని పట్టుకొని జగన్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. జగన్ ఇంటికి వెళ్లి సినిమా గురించి చెప్పి ఇలా సీఎం పాత్ర వేయమని అడిగాను. అందుకు జగన్ నవ్వి సారి అండి నాకు సినిమాలు చేయడం ఇష్టం లేదు. కానీ ఆ పాత్ర కోసం నన్ను ఊహించుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పారు. ఆ తర్వాత సినిమా గురించి మరిన్ని వివరాలు అడిగి అల్ ది బెస్ట్ చెప్పారని తెలిపారు.

Also Read : TVK Vijay TN Elections 2026 : ఓటు వేసేందుకు వచ్చిన విజయ్.. పోలింగ్ కేంద్రం వద్ద రచ్చరచ్చ.. తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్

అలా వైఎస్ జగన్ కి ఎవడైతే నాకేంటి సినిమాలో సీఎం పాత్రని ఆఫర్ చేసారు డైరెక్టర్ సముద్ర. దానిని జగన్ రిజెక్ట్ చేసారు. అనంతరం సినిమాలో ఆ పాత్రని నటుడు గిరిబాబు వేశారు.