Dhanashree verma : నితిన్ పాటకి క్రికెటర్ చాహల్ భార్య మాస్ డాన్స్ అదుర్స్.. రాను రానంటూనే సిన్నదో!
టీమిండియా స్పిన్నర్ చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ నితిన్ సూపర్ హిట్ సాంగ్ 'రాను రానంటూనే సిన్నదో' సాంగ్ కి మాస్ డాన్స్..
- gum 95921
- Published On : August 17, 2023 / 02:40 PM IST
Yuzvendra Chahal wife Dhanashree verma dance for Ranu Ranu Antune Chinnado
Dhanashree verma : సోషల్ మీడియా ఎక్కువ ఉపయోగించే వారికి టీమిండియా స్పిన్నర్ చాహల్ (Yuzvendra Chahal) సతీమణి ధనశ్రీ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదిరిపోయే డాన్స్ వీడియోలతో యూ ట్యూబ్ ఛానల్ లో లక్షల సంఖ్యలో సబ్ స్ర్కైబర్లు అందుకుంది. డాన్సుల్లో అమ్మడి ఎనర్జీ చూస్తుంటే ప్రతిఒక్కరికి ఊపు వస్తుంది. ఇక చాహల్ వివాహం తరువాత అతడితో పాటు ఇతర ఇండియన్ క్రికెటర్స్ తో కూడా అదిరిపోయే డాన్స్ వీడియోలు చేసి షేర్ చేసి నెట్టింట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) సూపర్ హిట్ సాంగ్ కి డాన్స్ మాస్ స్టెప్పులు వేసి విజిల్స్ వేసేలా చేస్తుంది. నితిన్ రీసెంట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’లో తన సూపర్ హిట్ సాంగ్ ‘రాను రానంటూనే సిన్నదో’ సాంగ్ బిట్ ని రీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ బిట్ ని చాలామంది ఫ్యాన్స్ అండ్ సెలబ్రిటీస్ కూడా రీ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ చేశారు. తాజాగా ధనశ్రీ వర్మ కూడా ఆ పాటకి ఇన్‌స్టా రీల్ చేసి షేర్ చేసింది.
అసలే అమ్మడి డాన్స్ లో ఫుల్ ఎనర్జీ ఉంటుంది. అలాంటిది ‘రాను రానంటూనే’ వంటి సాంగ్ కి డాన్స్ అంటే ఇక సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే. నితిన్ ని ట్యాగ్ చేస్తూ ధనశ్రీ వర్మ ఈ వీడియోని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మరి ఆ సాంగ్ ని ఒకసారి మీరుకూడా చూసేయండి.
